Disha murder case: ఎన్ కౌంటర్ తో కథ ముగియలేదు.. అసలు కథ ఇప్పుడే...
అసలు స్టోరీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. పారిపోతుంటే ఎన్ కౌంటర్ చేశామని పోలీసులు చెబుతున్నారు.. అయితే... నిజంగానే పారిపోతుంటే చేశారా లేదా... కావాలని చంపి అలా చెబుతున్నారా అనే ప్రశ్న తలెత్తే అవకాశం ఉంది. ఈ ప్రశ్న మానవ హక్కుల సంఘాల నుంచి తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంది.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసులో నిందితులకు తగిన శిక్ష పడింది. నిందులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. సీన్ రీ కన్ స్ట్రక్షన్ కోసం తీసుకొని వెళితే... అక్కడ పోలీసులపై దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించారు. దీంతో... పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. దీంతో.. నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఎన్ కౌంటర్ వార్త వినగానే ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. పోలీసులపై పొగడ్తల వర్షం కురిపిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగైనా దిశ ఆత్మకు శాంతి కలిగిందంటూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. అయితే... ఈ ఎన్ కౌంటర్ తో నిందితులకు తగిన శాస్తి జరిగిందని అందరూ అనుకుంటున్నారు. అయితే... ఇక్కడితో కథ ముగియలేదు.
అసలు స్టోరీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. పారిపోతుంటే ఎన్ కౌంటర్ చేశామని పోలీసులు చెబుతున్నారు.. అయితే... నిజంగానే పారిపోతుంటే చేశారా లేదా... కావాలని చంపి అలా చెబుతున్నారా అనే ప్రశ్న తలెత్తే అవకాశం ఉంది. ఈ ప్రశ్న మానవ హక్కుల సంఘాల నుంచి తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంది. అందువల్ల పోలీసులు ఏ పరిస్థితుల్లో ఎన్ కౌంటర్ చేశారు..? ఏ పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది అన్న విషయం పూర్తి ఆధారాలు, వివరాలతో కోర్టుకు రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది.
AlsoRead దిశకు న్యాయం... రియల్ లైఫ్ సింగం.. సజ్జనార్ అంటూ... నెటిజన్ల ఆనందాలు...
నిందితులను కావాలని చంపలేదు.. కేవలం పారిపోతుంటే మాత్రమే కాల్చేశామని పోలీసులు తమ వాదనను కోర్టుకు బలంగా వినిపించాల్సి ఉంటుంది. అలా నిరూపించుకోగలిగినప్పుడు.. ఈ కేసును కోర్టు క్లోజ్ చేస్తుంది. లేదంటే.. పోలీసులకు చిక్కొచ్చే అవకాశం ఉంది.
ఒకవేళ నిందితుల తల్లిదండ్రులు లేదా మానవ హక్కుల సంఘాలు... ఈ ఎన్‌కౌంటర్ అంశంపై కోర్టుకు వెళ్తే... జరిగింది ఎన్‌కౌంటర్ కాదని పిటిషన్ వేస్తే... అప్పుడు ఈ కేసులో లోతైన దర్యాప్తు జరిపించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ని వేసే అవకాశాలుంటాయి. ఎందుకంటే... ఇదివరకు 2008లో వరంగల్ యాసిడ్ ఎటాక్ దాడిలో నిందితుల్ని ఇలాగే ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపారు.
AlsoRead ‘దిశ’ను ఎక్కడైతే సజీవదహనం చేశారో.... అదే స్థలంలో.....
మళ్లీ అదే విధంగా దిశ హత్యాచారం హత్య కేసులో కూడా... చెయ్యాలని ప్రజలు పెద్ద ఎత్తున కోరడం... అందుకు తగ్గట్లుగానే... సీన్ రీకన్‌స్ట్రక్షన్‌లో ఎన్‌కౌంటర్ జరగడంతో... దీనిపై నిందితుల తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ చాలా ప్రాణభయంతో ఉన్న తమ పిల్లలు (నిందితులు) పోలీసుల దగ్గర ఆయుధాలు లాక్కొనేంత ధైర్యం చెయ్యరని అంటున్నారు. ఇలా దిశ హత్యాచారం హత్య కేసులో ఎన్‌కౌంటర్‌ను 99 శాతం మంది సమర్థిస్తుంటే... ఆ ఒక్క శాతం మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.