రేపు జరిగే వేలంలో 332 మంది క్రికెటర్లు (186 భారతీయులు, 146 మంది విదేశీ ఆటగాళ్ళు) తమ ధర ఎంతో పరీక్షించుకోనున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్వెల్, ప్రముఖ దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ లు మరో 5గురితో కలిసి తమ బేస్ ప్రైస్ ను అత్యధిక స్లాట్ అయిన 2 కోట్ల బ్రాకెట్ లో ఉంచారు.