2020 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) వేలం గురువారం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కలకత్తాలో జరగనుంది.

రేపు జరిగే వేలంలో 332 మంది క్రికెటర్లు (186 భారతీయులు, 146 మంది విదేశీ ఆటగాళ్ళు) తమ ధర ఎంతో పరీక్షించుకోనున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్వెల్,  ప్రముఖ దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్‌ లు మరో 5గురితో కలిసి తమ బేస్ ప్రైస్ ను అత్యధిక స్లాట్ అయిన 2 కోట్ల బ్రాకెట్ లో ఉంచారు.  

Also read: ఆ విషయాన్ని పంత్ అర్థం చేసుకోవాలి: గౌతం గంభీర్ సలహా

ఈ సారి వేలం గత సంవత్సరం అంత భారీ స్థాయిలో ఉండదు. కేవలం 73 మందిని 8 జట్లు ఎన్నుకోనున్నాయి. వీరిలో విదేశీ ఆటగాళ్లు కేవలం 29 మందే. ఆసక్తికర అంశం ఏమిటంటే 2 కోట్ల బ్రాకెట్లో ఒక్క భారతీయ ప్లేయర్ కూడా లేకపోవడం గమనార్హం. 

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వద్ద ఖర్చు చేయడానికి డబ్బులు అధికంగా ఉన్నాయి. దాదాపుగా 42.70 కోట్ల రూపాయలను వారు వెచ్చించగలిగే పరిస్థితుల్లో ఉన్నారు. భారత ప్రీమియర్ టెస్ట్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను ఢిల్లీ క్యాపిటల్స్ తో ట్రేడ్ ఆఫ్ చేయడం వల్ల వారు ఇప్పుడు ఒక కెప్టెన్ కోసం చూస్తున్నారు. ఇంగ్లండ్ ప్రపంచ కప్ కెప్టెన్ ఎయోన్ మోర్గాన్ లేదా ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ కోసం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంది. 

హెవీవెయిట్స్ చెన్నై సూపర్ కింగ్స్, డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ దాదాపుగా ఒక నిర్దిష్టమైన జట్టును కలిగి ఉన్నారు. గాయాల కారణంగా ఎవరైనా ఆడకపోతే వారికి బ్యాక్ అప్ ఆటగాళ్లను తీసుకోవాలని చూస్తున్నారు. పైపెచ్చు వారి వద్ద పెద్దగా డబ్బులు కూడా లేవు. 

ఇక భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి చెందిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విదేశీ ఆటగాళ్ళపై దృష్టి పెడుతుంది, అయితే డబ్బులు మాత్రం వారి వద్ద ఎక్కువగా లేవు. "ఈ సాల కప్ నమ్దే" అని ప్రతిసారి నమ్మే ఆ జట్టు ఏ సారి కూడా కప్ గెలవలేకపోతుంది. ఈ నేపథ్యంలో రేపు ఆ టీం ఎలా వేలానికి వెళ్తుందో చూడాలి. 

ఇక మన సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే... కీలక ఆటగాళ్లందరిని అట్టిపెట్టుకుంది. కేవలం మార్టిన్ గప్తిల్, యూసఫ్ పఠాన్ లాంటి స్టార్లను, దీపక్ హోదా, రికీ భూయి లాంటి యంగ్ ప్లేయర్స్ ని మాత్రమే వదులుకుంది. కనే విల్లియంసన్, డేవిడ్ వార్నర్, రషీద్ ఖాన్, మనీష్ పాండే వంటి కీ ప్లేయర్స్ అందరూ అలాగే ఉన్నారు. 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 వేలం ఎప్పుడు ప్రారంభమవుతుంది?

ఐపిఎల్ 2020 వేలం డిసెంబర్ 19 గురువారం మధ్యాహ్నం 2:30 నుండి ప్రారంభమవుతుంది. 

ఐపిఎల్ 2020 వేలం ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ వస్తుంది?

గురువారం జరిగే ఐపీఎల్ 2020 వేలంపాటను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో చూడవచ్చు.

ఐపిఎల్ 2020 వేలం ఆన్‌లైన్‌లో ఎలా చూడవచ్చు?

ఐపిఎల్ 2020 వేలం కోసం హాట్ స్టార్ గురువారం ప్రత్యక్ష ప్రసారాన్ని అందించనుంది.

ఐపిఎల్ 2020 వేలం లైవ్ అప్ డేట్స్ ఎక్కడ తెలుసుకోవచ్చు?

ఏషియా నెట్ న్యూస్ తెలుగు ను ఫాలో అయితే లైవ్ అప్ డేట్స్ అన్నీ మీ ముంగిట ఉన్నట్టే. 

ఐపీఎల్ 2020 వేలం ఎక్కడ జరుగుతుంది?

మొదటి సారిగా ఈ మెగా ఈవెంట్‌ను కోల్‌కతాలో నిర్వహిస్తున్నారు.