సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ బిడ్డింగ్ లో చాలా ఆచితూచి వ్యవహరించింది. డబ్బులు తక్కువగా ఉండడంతోపాటు కీ ప్లేయర్స్ అంతా టీంతోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏ ప్లేయర్ అవసరమో వారిని మాత్రమే తీసుకున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఒక విదేశీ అల్ రౌండర్ అత్యవసరం. అతగాడు మంచి బౌలర్ కూడా గనుక అయితే అది మరి మంచిది.

నిషేధం కారణంగా షకీబ్ దూరమవడంతో ఇంకో అల్ రౌండర్ ఆవశ్యకత ఏర్పడింది. ఈ నేపథ్యంలో మిచ్ మార్ష్ కోసం హైదరాబాద్ వెళ్లడం జరిగింది. అతను 2 కోట్ల బ్రాకెట్లో ఉండడంతో అతడి పేరు రాగానే హైదరాబాద్ అలెర్ట్ అయి బిడ్డింగ్ కి దిగింది. 2 కోట్ల బ్రాకెట్లో ఉండడంతో ఎవరు కొనుగోలు చేయరు అని అంతా భావించారు.

also read పాపం ఉనద్కత్: 5 కోట్ల నష్టం... పాత జట్టుకే 

కానీ అవసరాలకు తగ్గట్టుగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లేయర్స్ ను సెలెక్ట్ చేసుకోవడం లో దిట్ట. మంచి టీం సెలెక్ట్ చేసుకుంటుందని గొప్పపేరు ఉంది. ఆ పేరును నిలబెట్టుకుంటూనే సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సెలక్షన్ చేసింది. ఇక ఈ రోజు మరో ఇద్దరు ప్లేయర్స్ ని భారీ బిడ్డింగ్ మధ్య దక్కించుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్ . 

ఒకరేమో భారత అండర్-19 జట్టు కెప్టెన్ ప్రియం గార్గ్ కాగా, మరో ప్లేయర్ విరాట్ సింగ్. ఇద్దరిని కూడా ఒకటే ధర 1కోటి 90 లక్షలకు దక్కించుకుంది. విరాట్ సింగ్ ఝార్ఖండ్ తరుఫున చాలా బాగా ఆడే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్. ఇతను 125 స్ట్రైక్ రేట్ తో ప్రత్యర్థులపై విరుచుకుపడడం అతని సొంతం. 

మొన్న ముగిసినటువంటి ముస్తాక్ అలీ టోర్నమెంటులో విరాట్ సింగ్ ఎంతలా విరుచుకు పడ్డాడంటే అవతలి వైపున టీంల బౌలర్ల వద్ద ఇతడిని ఎలా ఎదుర్కోవాలో సమాధానం లేకుండా పోయింది. ఇక మరో ప్లేయర్ ప్రియం గార్గ్ అండర్-19 భారత జట్టు కెప్టెన్. ఇతడి స్ట్రైక్ రేట్ అమోఘం.

also read IPL చరిత్రలో అత్యధిక ధర పలికింది వీరే

ఇతడి షాట్ సెలక్షన్, మరి ముఖ్యంగా గ్రౌండ్ లో అతడి కదలికలు ఫుట్ వర్క్ అన్ని అద్భుతం అని స్వయంగా రాహుల్ ద్రావిడ్ చాలా సార్లు కొనియాడాడు. ఇంతకీ ఈ ఇద్దరి ప్లేయర్స్ ని తీసుకోవడం వెనుక కూడా ఒక వ్యూహం ఉంది. మన టీం కి ఆఖరులో ఒక ఫినిషర్ అవసరం ఉంది.

ఇంతకీ ఈ ఇద్దరి ప్లేయర్స్ ని తీసుకోవడం వెనుక కూడా ఒక వ్యూహం ఉంది. మన టీం కి ఆఖరులో ఒక ఫినిషర్ అవసరం ఉంది. సన్ రైజర్స్ వద్ద ఇన్ని రోజులు ఫినిషర్ పాత్రను యూసఫ్ పఠాన్ పోషించేవాడు. కాకపోతే వయసు పైబడటం వల్ల మునుపటి ఫామ్ ను అతను కొనసాగించలేకపోతున్నాడు. 

దానితోపాటుగా అతగాడిని సన్ రైజర్స్ ఈ సారి రిలీజ్ చేసింది. ఈ నేర్పథ్యంలో ఒక ఫినిషర్ అవసరం ఏర్పడింది. ఇప్పుడు ఈ ఇద్దరు చిచ్చరపిడుగులు, మిచ్ మార్ష్ లతో కలిసి టీం ఇప్పుడు ఒకింత బలంగా ఉంది. రేపటి వేలంలో భువనేశ్వర్ కుమార్ కి ఒక నాణ్యమైన ప్రత్యామ్నాయం ఎన్నుకోవాల్సి ఉంది. ప్రస్తుతం భువనేశ్వర్ ఫామ్ పై అనిశ్చితి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఎవరిని కొంటారో వేచి చూడాలి.