2020 ఎడిషన్ కోసం క్రికెటర్ల వేలం పాటలు తొలి రోజు గురువారం ముగిశాయి. కమిన్స్ అత్యధిక ధరతో కేకేఆర్ కు అమ్ముడుపోగా, మాక్స్ వెల్ ఆ తర్వాతి స్థానం ఆక్రమించి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కు దక్కాడు.

దక్షిణాఫ్రికా బౌలర్ స్టెయిన్‌ను రూ.2 కోట్లు పెట్టి బెంగళూరు దక్కించుకుంది

అండ్రూ టైని రాజస్థాన్ రాయల్స్ 1 కోటి పెట్టి కొనుగోలు చేసింది

లలిత్ యాదవ్‌ను 20 లక్షలు పెట్టి ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది

షాబాజ్ అహ్మద్‌ను 20 లక్షలు పెట్టి బెంగళూరు కొనుగోలు చేసింది.

నిఖిల్ నాయక్‌ను రూ.20 లక్షలు పెట్టి నైడ్ రైడర్స్ కొనుగోలు చేసింది

టామ్ కర్రన్‌ను రూ.కోటి రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. 

ఉదానాను రూ.50 లక్షల పెట్టి బెంగళూరు కొనుగోలు చేసింది

మార్కస్ స్టోయినిస్‌ను 4.80 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్‌ కొనుగోలు చేసుకోగా, మార్క్ వుడ్‌ను ఎవరు పట్టించుకోలేదు

ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌ను పంజాబ్ 55 లక్షలకు దక్కించుకుంది. తుషార్ దేశ్ పాండే 20 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. 

ఆసీస్ ఆటగాడు డేవిడ్ మిల్లర్‌ను రాజస్థాన్ రాయల్స్ 75 లక్షలకు, సౌరభ్ తీవారీని ముంబై ఇండియన్స్ 50 లక్షలకు కొనుగోలు చేసింది. 

విండీస్ విధ్వంసక ఆటగాడు.. ప్రస్తుతం భారత్‌తో జరుగుతున్న సిరీస్‌లో పరుగుల వరద పారిస్తున్న హెట్మేయర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ సుమారు 7.75 కోట్లకు కొనుగోలు చేసింది.

కివీస్ పేసర్ ఆడమ్ మిల్నే ను కూడా ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు ఆస్ట్రేలియా పేసర్ హాజిల్ వుడ్ ను చెన్నై సూపర్ కింగ్స్ రూ. 2కోట్లకు కొనుగోలు చేసింది.బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజర్ రహ్మాన్, యువ ఫాస్ట్ బౌలర్ అల్జరీ జోసెఫ్, ఇంగ్లాండు పేసర్ మార్క్ వుడ్ లను ఎవరూ కొనలేదు.

Also Read: విండీస్ ప్లేయర్స్ కి కలిసొచ్చిన భారత పర్యటన: భారీ రేటు పలికిన ప్లేయర్స్

ఫాస్ట్ బౌలర్ అన్రిచ్ నోర్ట్జే అమ్ముడుపోలేదు. జిమ్మీ నీష్ కూడా అమ్ముడు పోలేదు. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ బెన్ కట్టింగ్ ను కూడా ఎవరూ కొనలేదు. రిషి ధావన్, ఆల్ రౌండర్ కొలిన్ మన్రో, అండిలే ఫెహ్లుక్వాయోలను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు.

ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.  2 కోట్లకు కొనుగోలు చేసింది. మార్కుస్ స్టొయినిస్ ను కూడా ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు.

మార్టిన్ గుప్తిల్ పట్ల ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి ప్రదర్శించలేదు. అదే విధంగా కొలిన్ ఇంగ్రామ్ కూడా అమ్ముడు పోలేదు.

సౌరబ్ తివారీని ముంబై ఇండియన్స్ రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది. డేవిడ్ మిల్లర్ ను రాజస్థాన్ రాయల్స్ రూ.75 లక్షలకు సొంతం చేసుకుంది. ఎవిన్ లూయిస్ ను ఎవరూ కొనుగోలు చేయలేదు. వెస్టిండీస్ ప్లేయర్ షిమ్రోన్ హెట్ మెయిర్ కోసం ఫ్రాంచేజీలు పోటీ పడ్డాయి. అతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 7.75 కోట్లకు కొనుగోలు చేసింది.

ఆర్ సాయి కిశోర్ ను ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేయలేదు. రవి బిష్ణోయ్ ని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ.2 కోట్లకు సొంతం చేసుకుంది. అఫ్గానిస్తాన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ అమ్ముడు పోలేదు.

మిథున్ సుదేశన్ పై ఫ్రాంచేజీలు ఆసక్తి చూపలేదు. అతను అమ్ముడు పోలేదు. ఎం సిద్దార్థను కేకేఆర్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. కెసీ కరియప్ప అమ్ముడు పోలేదు.

రీలే మెరెడిత్ పట్ల ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. ఇషాన్ పొరేల్ మాత్రం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంచైజీకి రూ. 20 లక్షలకు అమ్ముడుపోయాడు.

Also Read: పాపం ఉనద్కత్: 5 కోట్ల నష్టం... పాత జట్టుకే

కార్తిక్ త్యాగిని రాజస్థాన్ రాయల్స్ రూ.1.30 కోట్లకు కొనుగోలు చేసింది. తుషార్ దేశ్ పాండే, కుల్వంత్ ఖేజ్రోలియా అమ్ముడు పోలేదు. బౌలర్ ఆకాశ్ సింగ్ ను మాత్రం రాజస్థాన్ రాయల్స్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది.

విష్ణు వినోద్ ను కూడా ఎవరూ కొనుగోలు చేయలేదు. అతని బేస్ ప్రైస్ రూ.20 లక్షలు మాత్రమే. అంకుశ్ బెయిన్స్, ప్రభ్ సిమ్రాన్, కెఎస్ భరత్ అమ్ముడు పోలేదు.

కేదార్ దేవధర్ ను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. వికెట్ కీపర్ అనుజ్ రావత్ ను రాజస్థాన్ రాయల్స్ రూ.80 లక్షలకు కొనుగోలు చేసింది.

యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. చివరకు అతన్ని రూ.2.40 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది.

వరుణ్ చక్రవర్తిని రూ. 4 కోట్లకు కోల్ కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. ఆల్ రౌండర్ దీపక్ హుడాను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ. 50 లక్షలకు సొంతం చేసుకుంది.

ఇండియా అండర్ 19 జట్టు కెప్టెన్ ప్రియం గార్గ్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.1.9 కోట్లకు కొనుగోలు చేసింది. విరాట్ సింగ్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.1.9 కోట్లకు కొనుగోలు చేసింది.

రాహుల్ త్రిపాఠీని రూ.60 లక్షలకు కోల్ కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. హర్ ప్రీత్ భాటియా అమ్ముడు పోలేదు. రోహన్ కదమ్ కూడా అమ్ముడు పోలేదు. బ్యాట్స్ మన్ మంజోత్ కల్రాను ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేయలేదు.

 

అఫ్గానిస్తాన్ బౌలర్ జహీర్ ఖాన్ ను ఫ్రాంచైజీలు కొనుగోలు చేయలేదు. హెడెన్ వాల్ష్ కూడా అమ్ముడు పోలేదు. అతని కనీస ధర రూ.50 లక్షలు. ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడం జంపాను కూడా ఎవరూ కొనలేదు.

భారత స్పిన్నర్ పియూష్ చావ్లా రూ.6.75 కోట్లకు అమ్ముడుపోయాడు. చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని సొంతం చేసుకుంది.

షెల్డన్ కోట్రెల్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. అతను రూ. 8.5 కోట్లకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కు అమ్ముడుపోయాడు. న్యూజిలాండ్ టిమ్ సౌథీ అమ్ముడు పోలేదు. 

నాథన్ కౌల్టర్ నీల్ ను ముంబై ఇండియన్స్ రూ.8 కోట్లకు కొనుగోలు చేసింది. ఆండ్య్రూ టై కూడా చుక్కెదురైంది. అతన్ని ఎవరూ కొనుగోలు చేయలేదు.

ఉనద్కత్ ను రూ. 3 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. బౌలర్ డేల్ స్టెయిన్ ను కూడా ఏ ఫ్రాంచేజీ కొనుగోలు చేయలేదు. ఇండియన్ బౌలర్ మోహిత్ శర్మకు కూడా నిరాశే ఎదురైంది. అతను అమ్ముడు పోలేదు.

ఐపిఎల్ వేలంలో వెస్టిండీస్ వికెట్ కీపర్ షాయ్ హోప్ కు కూడా నిరాశే ఎదురైంది. అతన్ని కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు ఇష్టపడలేదు.

బంగ్లాదేశ్ వికెట్ కీపర్ ముషాఫికుర్ రహీంను అమ్ముడు పోలేదు. అదే విధంగా హీన్రిచ్ క్లాసెన్ ను కూడా ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ కారేను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.2.4 కోట్లకు కొనుగోలు చేసింది.

స్టార్ట్ బిన్నీని కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. మోరిస్ ను రాయల్ చాలెంజర్స్ రూ.10 కోట్లకు కొనుగోలు చేసింది. కుర్రాన్ ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.5.5 కోట్లకు కొనుగోలు చేసింది. 

మ్యాక్స్ వెల్ ను కమిన్స్ దాటేశాడు. అతని కోసం ఫ్రాంచేజీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరకు కోల్ కతా నైట్ రైడర్స్ రూ.15.5 కోట్లకు కొనుగోలు చేసింది.

 

గ్లెన్ మాక్స్ వెల్ కోసం ఫ్రాంచైజీలు పెద్ద యెత్తున పోటీ పడ్డాయి.  అతన్ని పంజాబ్ రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది.క్రిస్ వోక్స్ ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసింది.

యూసుఫ్ పఠాన్ ను ఎవరూ కొనుగోలు చేయలేదు.

ఆరోన్ ఫించ్ ను రూ.4.40 కోట్లకు రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ దక్కించుకుంది. జాసోన్ రాయ్ ని రూ. 1.50 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.

ఛతేశ్వర్ పుజారాకు చుక్కెదురైంది. అతన్ని ఏ ఫ్రాంచేజీ కూడా కొనుగోలు చేయలేదు. అతని బేస్ ప్రైస్ రూ. 50 లక్షలు.. తెలుగు విహారీని తీసుకోవడానికి కూడా ఎవరూ ఇష్టపడలేదు. అతని బేస్ ప్రైస్ రూ. 50 లక్షలు. రాబిన్ ఊతప్పను రాజస్థాన్ రాయల్స్ రూ.3 కోట్లకు దక్కించుకుంది. 

ఇయోన్ మోర్గాన్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. అతన్ని కోల్ కతా నైట్ రైడర్స్ (కెకెఆర్) రూ.5.25 కోట్లకు కొనుగోలు చేసింది.

ఐపిఎల్ 2020 కోసం తొలుత అమ్ముడుపోయిన క్రికెటర్ క్రిస్ లిన్. అతన్ని ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. రెండు కోట్ల రూపాయలకు అతన్ని ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 13 ఎడిషన్ కోసం ఆటగాళ్ల వేలం పాటలు కోల్ కతాలో గురువారం సాయంత్రం 3.30 గంటలకు ప్రారంభమైంది. అంతకు ముందు వేలం పాటలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
 
మొత్తం 332 మంది క్రికెటర్లు వేలంలో పాల్గొంటున్నారు. ఎనిమిది ఫ్రాంచైజీలు 127 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. వారిలో 35 మంది విదేశీ ఆటగాళ్లున్నారు.