IPL Auction 2020: ఖర్చు కాస్త ఎక్కువైనా పర్లేదు.. టాప్ ప్లేయర్స్ పై కన్నేసిన సన్ రైజర్స్!
టామ్ మూడీ శిక్షణ సారథ్యంలో ఐదు సీజన్లలో ప్లేఆఫ్స్‌కు చేరుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ 2016లో చాంపియన్‌గా నిలిచింది. 2018లో రన్నరప్‌గా నిలిచింది. ఈ ఏడాది వరల్డ్‌కప్ సాధించిన కోచ్ ట్రెవర్ బేలిస్‌ను చీఫ్ కోచ్‌గా ఎంచుకున్న హైదరాబాద్.. జట్టు నిర్మాణంలోనూ కొత్త ఆటగాళ్లను భాగస్వామ్యం చేయాలని ఆలోచిస్తుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆటగాళ్ల వేలానికి రంగం సిద్ధమైంది. వచ్చే ఏడాదిలో మెగా వేలం ఉండగా.. తాజా వేలంపై పెద్ద ఆసక్తి లేకపోయినా జట్ల బలోపేతంపై ప్రాంఛైజీలు దృష్టి సారించాయి.
2021 సీజన్‌కు ముందు ఆటగాళ్లు అందరూ వేలంలోకి రానున్నారు. రైట్ టూ రిటర్న్ కార్డు అవకాశం ప్రాంఛైజీలకు లభించినా స్టార్ ఆటగాళ్లు సైతం వేలంలోకి అందుబాటులోకి వస్తారు. బుధవారం కోల్‌కతలో జరుగున్న ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో 332 మంది ఆటగాళ్లు వేలంలో ఉన్నారు.
తొలుత 997 ఆటగాళ్లు రేసులో నిలిచినా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ జాబితాను 332కు కుదించింది. ఎనిమిది ప్రాంఛైజీలలో 73 స్థానాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రేసులో 332 మంది ప్లేయర్స్ ఉన్నారు.
ప్రతి జట్టులోనూ కోర్ జట్టు సభ్యులు అలాగే ఉన్నారు. ఒక్కో జట్టుకు ఒక్కో విభాగంలో అవసరాలు ఉన్నాయి. ఓపెనింగ్, టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్, ఫినిషర్స్, స్పిన్ ఆల్‌రౌండర్, పేస్ ఆల్‌రౌండర్, పేసర్లు ఇలా ఒక్కో జట్టు అవసరాలు ఒక్కో విధంగా ఉన్నాయి.
ఇప్పటికే కుదురుకున్న జట్టుకు బ్యాకప్ కోసం కొన్ని ప్రాంఛైజీలు ఎదురుచూస్తున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్‌లు వేలంలో ప్రధానంగా బిగ్ ప్లేయర్స్‌పై కన్నేశాయి. కోల్‌కతలో నేడు మధ్యాహ్నాం 3 గంటలకు ఆటగాళ్ల వేలం ఆరంభం కానుంది.
సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఎవరెవరు అవసరమంటే... టామ్ మూడీ శిక్షణ సారథ్యంలో ఐదు సీజన్లలో ప్లేఆఫ్స్‌కు చేరుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ 2016లో చాంపియన్‌గా నిలిచింది. 2018లో రన్నరప్‌గా నిలిచింది.
ఈ ఏడాది వరల్డ్‌కప్ సాధించిన కోచ్ ట్రెవర్ బేలిస్‌ను చీఫ్ కోచ్‌గా ఎంచుకున్న హైదరాబాద్.. జట్టు నిర్మాణంలోనూ కొత్త ఆటగాళ్లను భాగస్వామ్యం చేయాలని ఆలోచిస్తుంది.
డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, జానీ బెయిర్‌స్టో, మనీశ్ పాండే, శ్రీవత్స్ గోస్వామి, వృద్దిమాన్ సాహాలతో టాప్ ఆర్డర్ బ్యాటింగ్ బాగుంది. విజయ్ శంకర్, మహ్మద్ నబి, అభిషేక్ శర్మ రూపంలో మెరుగైన ఆల్‌రౌండర్లు ఉన్నారు.
రషీద్ ఖాన్, షాబాజ్ నదీమ్‌లు స్పిన్ విభాగంలో ఉండగా.. పేస్ బృందంలో భువనేశ్వర్ కుమార్, సిద్దార్థ్ కౌల్, ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మ, బసిల్ తంపీ, నటరాజన్, బిల్లీ స్టాన్‌లేక్‌లు ఉన్నారు.
గత 15 నెలలుగా భువనేశ్వర్ కుమార్ ఫిట్‌నెస్‌పై అనిశ్చితి నెలకొంది. చీటికిమాటికి గాయాల పాలవుతున్నాడు. దీంతో అతడికి బ్యాకప్‌గా మరో నాణ్యమైన పేసర్‌ను సన్‌రైజర్స్ కోరుకుంటోంది.
ఫినిషర్ పాత్ర కోసం సన్‌రైజర్స్ సరైన వాడి కోసం అన్వేషిస్తోంది. ఓ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ పాత్ర కోసం భారత ఆటగాడి అవసరం ఉంది. వేలంలో గ్లెన్ మాక్స్‌వెల్, ఇయాన్ మోర్గాన్, గ్రాండ్‌హౌమె, షిమ్రోన్ హెట్‌మయర్, క్రిస్ మోరిస్ సహా రాబిన్ ఉతప్ప, హనుమ విహారి, రాహుల్ త్రిపాఠి, ఖాన్, విష్ణు వినోద్‌ల కోసం సన్‌రైజర్స్ వేలంలో పోటీపడే అవకాశం ఉంది.
డేల్ స్టెయిన్, నాథన్ కౌల్టర్ నైల్, ఆండ్రూ టైలలో ఒకరిని తీసుకునేందుకు కూడా మొగ్గు చూపనుంది. హైదరాబాద్ జట్టులో ఏడుగురు ఆటగాళ్లు అవసరం. అందులో ఇద్దరు విదేశీ ఆటగాళ్లుకు అవకాశం ఉంది.