IPL 2024 Auction LIVE: దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2024 వేలంలో భారత ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ ను పంజాబ్ కింగ్స్ రూ.11.75 కోట్లకు కొనుగోలు చేసింది. 2021 సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచిన హర్షల్ గత మూడు సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఉన్నాడు.
2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు సంబంధించి వేలం పాట ఆసక్తికరంగా సాగుతోంది. ఈ ఏడాది భీకర ఫాంలో వున్న న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్రను చెన్నై సూపర్ కింగ్స్ 1.8 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది.
ఐపీఎల్ 2024 కోసం భారత ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ ను చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. 2018, 2021లో చెన్నై సూపర్ కింగ్స్ తో రెండుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన ఆయనను 4 కోట్లకు కొనుగోలు చేసింది.
IPL 2024 Auction LIVE: ఐపీఎల్ వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ నిలిచాడు. కొత్త రికార్డులు నమోదుచేస్తూ ఏకంగా రూ.20.50 కోట్లకు హైదరాబాద్ అతన్ని దక్కించుకుంది. ఆ తర్వాత న్యూజిలాండ్ ప్లేయర్ డారిల్ మిచెల్ అతని తర్వాత అధిక ధర పలికిన ప్లేయర్ గా ఉన్నాడు.
IPL 2024 Auction LIVE: ఐపీఎల్ వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ నిలిచాడు. కొత్త రికార్డులు నమోదుచేస్తూ ఏకంగా రూ.20.50 కోట్లకు హైదరాబాద్ అతన్ని దక్కించుకుంది.
IPL 2024 Auction LIVE updates: ఐపీఎల్ 2024 వేలంలో వరల్డ్ కప్ హీరో ట్రావిస్ హెడ్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. అతని కోసం చైన్నై సూపర్ కింగ్స్ కూడా పోటీ పడింది.
IPL 2024 Auction LIVE updates: ఐపీఎల్ వేలం ప్రారంభమైంది. ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ను ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.
IPL 2024 Auction LIVE updates: మొదటిసారి విదేశాల్లో ఐపీఎల్ వేలం ప్రారంభమైంది. దుబాయ్ లోని కోకకోలా ఎరీనాలో ఐపీఎల్ 2024 వేలం ప్రారంభమైంది. వేలంలో మొదటి ప్లేయర్ రోవ్మాన్ పావెల్ ను భారీ ధరతో రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది.
IPL 2024 Auction LIVE updates: టాప్ టైర్ క్రికెట్ కు దూరమై ఏడాది కావస్తున్నా క్రికెట్ ప్రపంచం అతని కోసం ఎదురుచూస్తూనే ఉంది. అతనే రిషబ్ పంత్. భయంకరమైన కారు ప్రమాదం తర్వాత, రిషబ్ పంత్ 2023 ఐపీఎల్ కు దూరమయ్యాడు.
IPL 2024 Auction: ఐపీఎల్ 2024 వేలంలో ఉన్న ఆటగాళ్లలో ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్, హర్షల్ పటేల్, శార్దూల్ ఠాకూర్ సహా 23 మంది ఆటగాళ్లు బేస్ ప్రైస్ 2 కోట్లుగా నిర్ణయించారు. 13 మంది ఆటగాళ్ల బేస్ ధర 1.5 కోట్లుగా నిర్ణయించారు.