IPL 2024 Auction: ఐపీఎల్ 2024 వేలంలో ఉన్న ఆట‌గాళ్ల‌లో ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్, హర్షల్ పటేల్, శార్దూల్ ఠాకూర్ సహా 23 మంది ఆటగాళ్లు బేస్ ప్రైస్ 2 కోట్లుగా నిర్ణయించారు. 13 మంది ఆటగాళ్ల బేస్ ధర 1.5 కోట్లుగా నిర్ణయించారు. 

IPL 2024 Auction LIVE updates: ఐపీఎల్ 2024 మినీ వేలం జోష్ మొద‌లైంది. అన్ని టీంలు బ‌ల‌మైన జ‌ట్టును నిర్మించ‌డానికి కొత్త ఎంపిక‌లు చేసుకోనున్నాయి. 214 మంది భారతీయులు, 119 విదేశీ ఆటగాళ్లతో సహా మొత్తం 333 మంది ఆటగాళ్లు వేలం బరిలో ఉన్నారు. 30 మంది విదేశీ ఆటగాళ్లతో సహా 77 మంది ఆటగాళ్లు వివిధ జ‌ట్లు వేలంలో ఒప్పందాలు చేసుకోనున్నాయి. ప‌లు జ‌ట్ల వ‌ద్ద భారీగా మ‌నీ ప‌ర్సు ఉంది. 


వివిధ జ‌ట్ల వ‌ద్ద ప్ర‌స్తుతం ఉన్న మ‌నీప‌ర్సు వివ‌రాలు: 

  • రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB): ₹23.25 కోట్లు
  • చెన్నై సూపర్ కింగ్స్ (CSK): ₹31.4 కోట్లు
  • ముంబై ఇండియన్స్ (MI): ₹17.25 కోట్లు
  • గుజరాత్ టైటాన్స్ (GT): ₹38.15 కోట్లు
  • లక్నో సూపర్ జెయింట్స్ (LSG): ₹13.15 కోట్లు
  • కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR): ₹32.7 కోట్లు
  • రాజస్థాన్ రాయల్స్ (RR): ₹14.5 కోట్లు
  • ఢిల్లీ క్యాపిటల్స్ (DC): ₹28.9 కోట్లు
  • పంజాబ్ కింగ్స్ (PBKS): ₹29.1 కోట్లు
  • సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH): ₹34 కోట్లు 

214 మంది భారతీయులు, 119 విదేశీ ఆటగాళ్లతో సహా మొత్తం 333 మంది ఆటగాళ్లు వేలంలో ఉన్నారు. 30 మంది విదేశీ ఆటగాళ్లతో సహా 77 మంది ఆటగాళ్లను జట్లు తీసుకోనున్నాయి. వేలంలో ఉన్న ఆట‌గాళ్ల‌లో ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్, హర్షల్ పటేల్, శార్దూల్ ఠాకూర్ సహా 23 మంది ఆటగాళ్లు బేస్ ప్రైస్ 2 కోట్లుగా నిర్ణయించారు. 13 మంది ఆటగాళ్ల బేస్ ధర 1.5 కోట్లుగా నిర్ణయించారు. ఇంగ్లిష్ ఆల్ రౌండర్ సామ్ కర్రాన్ ఐపీఎల్ వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ 2023 వేలంలో పంజాబ్ కింగ్స్ రూ. 18.50 కోట్లు వెచ్చించి అతన్ని ద‌క్కించుకుంది.