IPL 2024 Auction LIVE updates: టాప్ టైర్ క్రికెట్ కు దూరమై ఏడాది కావస్తున్నా క్రికెట్ ప్ర‌పంచం అత‌ని కోసం ఎదురుచూస్తూనే ఉంది. అత‌నే రిష‌బ్ పంత్. భయంకరమైన కారు ప్రమాదం తర్వాత, రిషబ్ పంత్ 2023 ఐపీఎల్ కు దూరమయ్యాడు.  

Rishabh Pant: ఐపీఎల్ 2024 మిని వేలం దుబాయ్ లో ప్రారంభ‌మైంది. ఇదే స‌మ‌యంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ కు గుడ్ న్యూస్. ఆ టీం కీ ప్లేయ‌ర్ రిష‌బ్ పంత్ ఫిటినెస్ సాధించాడు. అత‌ను రాబోయే ఐపీఎల్ లో ఆడ‌నున్నాడ‌ని స‌మాచారం. కారు ప్రమాదంలో తీవ్ర గాయాలతో గత సీజన్ కు దూరమైన పంత్ ఐపీఎల్ 2024 వేలానికి వ‌చ్చాడు. త‌న ఫ్రాంచైజీతో క‌లిసి వేలంపాట‌లో పాల్గొన‌నున్నాడు. ఐపీఎల్ 2024 వేలం కోసం ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్ప‌టికే దుబాయ్ చేరుకుంది. వేలంలో పాల్గొనే తొలి క్రియాశీల ఆటగాడిగా పంత్ నిలవనున్నాడు. ఆయన ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమానికి హాజరు కాలేదని, దాని కోసం ఎదురు చూస్తున్నారని ఈ నేపథ్యంలోనే చెప్పారు.

2016లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన రిష‌బ్ పంత్ ఆ తర్వాత ప‌లు ఫ్రాంచైజీల తరఫున 98 మ్యాచ్లు ఆడి 147.97 స్ట్రైక్ రేట్తో 2838 పరుగులు చేశాడు. కొన్ని నెలలుగా పోటీ క్రికెట్ దూరంగా ఉన్న పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకుంటున్నాడు. భారత వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ తన కోలుకోవడంలో అసాధారణ పట్టుదలను, దృఢ సంకల్పాన్ని ప్రదర్శించాడు. టాప్ టైర్ క్రికెట్ కు దూరమై ఏడాది కావస్తున్నా క్రికెట్ ప్ర‌పంచం రిష‌బ్ పంత్ కోసం ఎదురుచూస్తూనే ఉంది. భయంకరమైన కారు ప్రమాదం తర్వాత, రిషబ్ పంత్ 2023 ఐపీఎల్ కు దూరమయ్యాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 చివరి ఎడిషన్, ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్, 2023 వన్డే వరల్డ్ క‌ప్ కు పంత్ దూరమయ్యాడు.

Scroll to load tweet…