Asianet News TeluguAsianet News Telugu

IPL 2024 Auction: చెన్నై టీంలోకి డారిల్ మిచెల్.. కీవీస్ ప్లేయ‌ర్ కు భారీ ధ‌ర‌..

IPL 2024 Auction LIVE: ఐపీఎల్ వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ నిలిచాడు. కొత్త రికార్డులు న‌మోదుచేస్తూ ఏకంగా రూ.20.50 కోట్ల‌కు హైద‌రాబాద్ అత‌న్ని ద‌క్కించుకుంది.  ఆ త‌ర్వాత న్యూజిలాండ్ ప్లేయ‌ర్ డారిల్ మిచెల్ అత‌ని త‌ర్వాత అధిక ధ‌ర ప‌లికిన ప్లేయ‌ర్ గా ఉన్నాడు.  
 

IPL 2024 Auction: After Rachin Ravindra, CSK snapped Daryl Mitchell for a whopping sum RMA
Author
First Published Dec 19, 2023, 3:12 PM IST

IPL 2024 Auction LIVE updates: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 ప్లేయర్స్ వేలం సెకండ్ సెట్ హాట్ హాట్ సాగింది. ఐపీఎల్ వేలం కొత్త రికార్డులు న‌మోద‌య్యాయి. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే మొద‌టి సారి ఒక ప్లేయ‌ర్ 20.50 కోట్ల రూపాయ‌లు పెట్టి హైద‌రాబాద్ టీం ప్యాట్ క‌మ్మిన్స్ ను ద‌క్కించింది. ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన వేలంలో ఆ త‌ర్వాతి స్థానంలో న్యూజిలాండ్ ప్లేయ‌ర్ డారెల్ మిచెల్ ఉన్నారు. ఈ వ‌ర‌ల్డ్ క‌ప్ హీరోను చెన్నై సూప‌ర్ కింగ్స్ ద‌క్కించుకుంది.

వరల్డ్ కప్ హీరో, లీగ్ దశలోనూ, సెమీఫైనల్లోనూ భారత్ పై డారెల్ మిచెల్ రెండు సెంచరీలు సాధించాడు. ఢిల్లీ కోటితో వేలంలోకి దిగింది. ఆ త‌ర్వాత పంజాబ్ కింగ్స్ కూడా మిచెల్ ను ద‌క్కించుకోవ‌డానికి 3 కోట్ల మార్కును కోట్ చేసింది. ఢిల్లీ, పంజాబ్ పోటీ ప‌డుతూ వేలం కొన‌సాగించాయి. పంజాబ్ కింగ్స్ వద్ద రూ.5 కోట్ల వ‌ర‌కు చేరుకుంది. ఆ త‌ర్వాత దీనిని ఢిల్లీ 6 కోట్లకు పెంచింది. పంజాబ్ వేలం 7 కోట్లకు చేరింది.  అలా పెరుగుతూ రూ. 10.25 కోట్లతో పంజాబ్ వెనక్కి తగ్గింది. ఢిల్లీ 11 కోట్ల‌తో ముందు సాగింది. ఇక పంజాబ్ డారిల్ మిచెల్ కోసం రూ.11.75 కోట్ల వ‌ర‌కు బిడ్ చేర్చింది.ఈ టైంలోనే చెన్నై రంగంలోకి దిగింది.  రూ.12 కోట్లతో వేలం షురూ చేసింది. 13.75 టైంలో పంజాబ్ ఉండ‌గా, చెన్నై సూప‌ర్ కింగ్స్ 14 కోట్ల రూపాయ‌ల‌తో డారెల్ మిచెల్ ను సొంతం చేసుకుంది.

ఇటీవ‌ల జ‌రిగిన ఐసీసీ వ‌న్డే ప్రపంచ కప్‌లో అతను 69.00 సగటు, 111.06 స్ట్రైక్ రేట్‌తో 552 పరుగులు చేశాడు. త‌న అద్బుత‌మైన ఆట‌తో కివీస్ జ‌ట్టు సెమీస్ కు చేర‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. డిరిల్ మిచెల్ 2022లో రాజస్థాన్ రాయల్స్‌లో జ‌ట్టులో భాగంగా ఉన్నాడు. ఫ్రాంచైజీ అతని ప్రాథమిక ధర రూ. 75 ల‌క్ష‌ల‌కు కొనుగోలు చేసింది. గత ఏడాది వేలంలో అమ్ముడుపోలేదు. అక్క‌డ అత‌ని ప్రారంభ ధ‌ర రూ. 1 కోటి. ఈ సారి మాత్రం ఏకంగా 14 కోట్ల రూపాయ‌లు ద‌క్కించుకున్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios