IPL 2024 Auction: ఆల్‌రౌండర్ హర్షల్ పటేల్ కోసం ఫైట్.. పంజాబ్ ఎంత‌కు ద‌క్కించుకుందంటే..?

IPL 2024 Auction LIVE: దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2024 వేలంలో భారత ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ ను పంజాబ్ కింగ్స్ రూ.11.75 కోట్లకు కొనుగోలు చేసింది. 2021 సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచిన హర్షల్ గత మూడు సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఉన్నాడు.
 

IPL 2024 Auction: Indian fast bowler Harshal Patel was sold to Punjab Kings for Rs. 11.75 crore RMA

IPL 2024 Auction LIVE updates: దుబాయ్‌లో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 మినీ వేలంలో పంజాబ్ కింగ్స్ భారీ ధరతో భారత ఆల్‌రౌండర్ హర్షల్ పటేల్‌ను సొంతం చేసుకుంది. అతన్ని కోసం పంజాబ్ టీమ్ రూ.11.75 కోట్లు ఖర్చు  చేసింది. అతను రూ. 2 కోట్ల  బేస్ ధరతో వేలంలోకి వచ్చాడు. అయితే, అతని కోసం పంజాబ్, గుజరాత్ టీమ్ లు పోటీ పడ్డాయి. దాదాపు ఆరు రెట్లు ఎక్కువ మొత్తంతో పంజాబ్ టీమ్ దక్కించుకుంది.

హర్షల్ పటేల్ డెత్ బౌలింగ్‌తో పాటు డెడ్లీ స్లోయర్ బౌన్సర్‌తో సహా పలు రకాల స్లోలర్ బంతులు వేయగలడు. అనేక గేమ్ లలో రికార్డు బౌలింగ్ తో అదరగొట్టాడు. ఇది రెండు ఫ్రాంచైజీల నుండి ఆసక్తిని ప్రేరేపించింది. గుజరాత్ టైటాన్స్ హర్షల్ పటేల్ కోసం రూ.10 కోట్ల మార్కును కూడా దాటింది. లక్నో కూడా 11 కోట్లకు వేలంలోకి వచ్చింది. అయితే, పంజాబ్ 11.75 కోట్ల రూపాయలతో పంజాబ్ దక్కించుకుంది. 

ఐపీఎల్ 2024 మినీ వేలానికి ముందు రైట్ ఆర్మ్ పేసర్ హర్షల్ పటేల్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విడుదల చేసింది. గత కొన్ని ఐపీఎల్ సీజన్లలో ఆడిన హర్షల్ పటేల్ 91 మ్యాచ్‌ల్లో 111 వికెట్లు పడగొట్టి భారత అగ్రశ్రేణి పేసర్‌లలో ఒకడిగా ఉన్నాడు. అతను గత సీజన్‌లో 13 మ్యాచ్‌లలో 14 వికెట్లు తీయగా, 2021 సీజన్‌లో తన బౌలింగ్ దుమ్మురేపాడు. 15 మ్యాచ్‌లలో 32 వికెట్లు సాధించి పర్పుల్ క్యాప్‌ను కూడా గెలుచుకున్నాడు.

IPL 2024 Auction: చెన్నై టీంలోకి డారిల్ మిచెల్.. కీవీస్ ప్లేయ‌ర్ కు భారీ ధ‌ర‌..

IPL 2024 Auction: ఐపీఎల్ రికార్డు బ్రేక్.. ప్యాట్ క‌మ్మిన్స్ కు దిమ్మ‌దిరిగే ధ‌ర‌.. !

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios