IPL 2024 Auction LIVE updates: ఐపీఎల్ 2024 వేలంలో వ‌ర‌ల్డ్ క‌ప్ హీరో ట్రావిస్ హెడ్ ను స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ సొంతం చేసుకుంది. అత‌ని కోసం చైన్నై సూప‌ర్ కింగ్స్ కూడా పోటీ ప‌డింది.  

IPL 2024 Auction LIVE updates: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 ప్లేయర్స్ వేలం షురూ అయింది. ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ 2023 హీరో, ఆస్ట్రేలియ‌న్ బ్యాట‌ర్ ట్రావిస్ హెడ్ ను స‌న్ రైజ‌ర్స్ సొంతం చేసుకుంది. అనుకున్న‌ట్టుగానే అత‌న్ని భారీ ధ‌ర‌లో హైద‌రాబాద్ టీం సొంతం చేసుకుంది. అత‌ని క‌నీస ధ‌ర రూ.2 కోట్లు కాగా, హైద‌రాబాద్ టీం 6.80 కోట్ల రూపాయ‌ల‌తో సొంతం చేసుకుంది. చెన్నై కూడా అత‌ని ద‌క్కించుకోవ‌డానికి ప్ర‌య‌త్నించింది.

ట్రావిస్ హెడ్..

ఆస్ట్రేలియాకు వరల్డ్ కప్ 2023 ఫైనల్ హీరో, ట్రావిస్ హెడ్ అటాకింగ్ ఓపెనర్. అతను నెం.3 లేదా 4లో బ్యాటింగ్ దిగ‌డంతోనే బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డే కీల‌క ప్లేయ‌ర్. ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ ఓపెనర్. ఈ సీజ‌న్ ఐపీఎల్ వేలంలో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ అత‌న్ని ద‌క్కించుకుంది.

IPL 2024 Auction:హ్యారీ బ్రూక్ ను సొంతం చేసుకున్న ఢిల్లీ.. ధ‌ర ఎంతంటే..

IPL 2024 Auction: ఐపీఎల్ 2024 వేలం షురూ.. రోవ్‌మాన్ పావెల్ కు భారీ ధర..