విశాఖ ఏజెన్సీలో మైనర్ బాలికపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.జి.మాడుగుల మండల కె.కోడాపల్లి పంచాయతీ జిన్నేరు గ్రామానికి చెందిన 15 ఏళ్ల గిరిజన బాలికపై ఇద్దరు  యువకులు మద్యంమత్తులో అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. 

ఈ దారుణానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జిన్నేరు గ్రామానికి చెందిన 15 సంవత్సరాల బాలికకు తల్లిదండ్రులు లేరు. దీంతో ఆమె అత్తా మామల సంరక్షణలో ఉంటోంది. అయితే ఈనెల 27వ తేదీన అత్తామామలు పనిపై బయటకు వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా వుంది బాలిక. దీన్ని పసిగట్టిన ఇద్దరు యువకులు మద్యం మత్తులో బాలికపై అతి దారుణంగా అఘాయిత్యానికి పాల్పడ్డారు. 

read more   ప్రియుడి కోసం భర్తను చంపి.. రెండు వారాల తర్వాత..

మత్స్యపురం, జన్నేరు పరిసరాల్లో నిత్యం పేకాట, చిత్తులాట నిర్భయంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో శనివారం పేకాట ఆడే  ప్రాంతానికి సమీపంలో ఊరికి దూరంగా ఉన్న ఇంట్లో బాలిక ఒంటరిగా వుండగా బందవిధి, గుర్రాయి గ్రామాలకు చెందిన యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. 

బాలిక కేకలు విని అటుగా వెళుతున్న పాంగి సూర్యకాంతం ఇంట్లోకి వెళ్లగా నిందితుడు బీరు బాటిల్తో ఆమెను భయపెట్టాడు. దీంతో ఆమె గ్రామంలోకి వెళ్లి కొందరు గ్రామస్థులను పిలుచుకొని వచ్చేలోపు జరగరాని ఘోరం జరిగిపోయింది. అప్పటికే యువతిపై అఘాయిత్యానికి పాల్పడిన కామాంధులు అక్కడి నుండి వెళ్లిపోయారు.