చీపురుపల్లిలో పోటీపై:మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు
చీపురుపల్లి నుండి పోటీ చేసే విషయమై పార్టీ ప్రతిపాదనపై ఆలోచిస్తున్నట్టుగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు.
విశాఖపట్టణం: తనను ఉమ్మడి విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నుండి పోటీ చేయాలని పార్టీ నాయకత్వం కోరిందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు.గురువారంనాడు విశాఖపట్టణంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. చీపురుపల్లి విశాఖపట్టణానికి 150 కి.మీ. దూరంలో ఉందన్నారు. వేరే జిల్లా అని ఆయన చెప్పారు. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణపై పోటీ చేయాలని తెలుగు దేశం పార్టీ నాయకత్వం గంటా శ్రీనివాసరావును కోరింది.
also read:వై.ఎస్. షర్మిల ఆందోళన: ఆంధ్రరత్న భవన్ వద్ద టెన్షన్
పార్టీ ప్రతిపాదనపై తాను ఆలోచిస్తున్నట్టుగా చెప్పారు. తనకు విశాఖపట్టణం నుండే పోటీ చేయాలని ఉందన్నారు.గతంలో విశాఖపట్టణంలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల నుండి పోటీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.చీపురుపల్లి నుండి పోటీ చేసే విషయమై తన అనుచరులు, సన్నిహితులు, తన టీమ్ తో చర్చిస్తున్నట్టుగా గంటా శ్రీనివాసరావు చెప్పారు.
సీటు రానప్పుడు పార్టీ మారడం పెద్ద విషయం కాదన్నారు.కేశినేని నానికి సీటు ఇవ్వలేమని చెబితేనే పార్టీ మారారని గంటా శ్రీనివాసరావు తెలిపారు. వైసీపీకి ఎంతో సహకరించిన వేమిరెడ్డి కూడ పార్టీ మారారన్నారు.వారం రోజుల్లో టీడీపీ అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉందన్నారు. అభ్యర్థుల జాబితాలో తాను ఎక్కడి నుండి పోటీ చేస్తానో మీకు తెలుస్తుందన్నారు.
also read:విశాఖలో మిలన్ 2024: 50 దేశాల నేవీ బృందాల విన్యాసాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు దేశం, జనసేన మధ్య పొత్తుంది. ఈ రెండు పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటుపై చర్చలు జరుగుతున్నాయి. పొత్తు కారణంగా తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు సీట్లను కోల్పోవాల్సి వచ్చింది. సీనియర్ నేతలు కూడ సీట్లను త్యాగం చేయాల్సిన పరిస్థితులు అనివార్యంగా మారే అవకాశం కూడ లేకపోలేదు. ఈ ఎన్నికల్లో గెలిచే అవకాశాలున్న అభ్యర్థులనే బరిలోకి దింపాలని తెలుగు దేశం పార్టీ భావిస్తుంది. ఈ మేరకు తెలుగు దేశం పార్టీ సర్వేలు నిర్వహిస్తుంది.ఈ సర్వేల ఆధారంగా టిక్కెట్లను కేటాయించనుంది.
also read:పవన్ కళ్యాణ్ చేతికి రెండు ఉంగరాలు: ఎంత పవరో తెలుసా?
టీడీపీ,జనసేన కూటమిలో బీజేపీ కూడ చేరే అవకాశం ఉందనే ప్రచారం కూడ లేకపోలేదు. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.బీజేపీ నేతలతో చర్చించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ న్యూఢిల్లీకి కూడ వెళ్లే అవకాశం ఉంది.