Search results - 422 Results
 • Murder

  NATIONAL22, Jan 2019, 12:11 PM IST

  వివాహేతర సంబంధం....సుపారీ గ్యాంగ్‌తో భర్తను అంతమొందించిన భార్య

  భర్త వేరే మహిళతో  వివాహేతన సంబంధం పెట్టుకోవడంతో ఓ భార్య అతన్ని అత్యంత కిరాకంగా హతమార్చింది. కిరాయి హంతకుల చేత భర్తను అంతమొందించి అతడి ఆస్తిని సొంతం చేసుకోవాలని చూసింది. చివరకు హత్యోదంతం బయటపడి పోలీసులకు చిక్కి కటకటాలపాలవ్వాల్సి వచ్చింది. ఈ ఘటన దేశ రాజధాని డిల్లీ శివారులోని గుర్‌‌గ్రావ్ లో చోటుచేసుకుంది.

 • INTERNATIONAL22, Jan 2019, 11:36 AM IST

  పాకిస్థాన్ ‌లో బస్సు-ఆయిల్ ట్యాంకర్ ఢీ...26మంది సజీవదహనం

  భారత్ దాయాది దేశం పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బలూచిస్థాన్ ప్రాంతంలో ఓ ఆయిల్ ట్యాంకర్- ప్రయాణికుల బస్సు ఢీ కొన్న ప్రమాదంలో 26 మంది   సజీవదహనమయ్యారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రితో చికిత్స పొందుతున్నారు. వారిలో కూడా చాలామంది పరిస్థితి విషమంగా వున్నట్లు అధికారులు తెలిపారు.  దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం వుంది. 

 • fathter

  Telangana21, Jan 2019, 1:20 PM IST

  తల్లిని మోసం చేశాడని తండ్రిపై కూతురి చీటింగ్ కేసు

  చీటింగ్ కేసులో కన్నతండ్రిని అరెస్ట్ చేయించింది కూతురు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ న్యూనల్లకుంటకు చెందిన వైద్యుడి మొదటి భార్య తనను వేధిస్తున్నాడంటూ 2003లో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 • rape

  NATIONAL19, Jan 2019, 10:39 AM IST

  డ్యాన్సర్‌పై బౌన్సర్‌ రేప్: కేసు వెనక్కి తీసుకోలేదని దారుణహత్య

  అత్యాచారానికి పాల్పడటమే కాకుండా బాధితురాలు కేసు పెట్టిందనే అక్కసుతో ఆమెను అత్యంత దారుణంగా కాల్చి చంపాడు ఓ కిరాతకుడు. వివరాల్లోకి వెళితే.. గుర్‌గావ్‌లోని ఓ బార్‌లో డ్యాన్సర్‌గా పనిచేస్తోన్న ఓ యువతి అదే బార్‌లో బౌన్సర్‌గా పనిచేస్తోన్న సందీప్ కుమార్ అనే వ్యక్తి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ 2017, మార్చిలో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 • Actor Prabhas

  Telangana16, Jan 2019, 2:54 PM IST

  షర్మిల ఫిర్యాదు: యూట్యూబ్, గూగుల్‌లకు లేఖ


   వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌ సోదరి షర్మిల ఇచ్చిన ఫిర్యాదుపై  విచారణ చేస్తున్నట్టు సైబర్ క్రైమ్ అదనపు డీసీపీ రఘువీర్ చెప్పారు. ఈ విషయమై గూగుల్‌కు, యూ ట్యూబ్‌కు  లేఖ రాసినట్టు ఆయన తెలిపారు.

   

 • car Accident

  Telangana16, Jan 2019, 2:13 PM IST

  విజయవాడ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం...ముగ్గురు మృతి

  సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద విజయవాడ-హైదరాబాద్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో టైరు పేలడంతో అదుపుతప్పి ఇతర వాహనాలను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా మరో బాలుడు కొర ఊపిరితో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

 • nellai murder

  Telangana16, Jan 2019, 9:38 AM IST

  హైదరాబాద్‌లో మరో దారుణం...నడిరోడ్డుపైనే దారుణ హత్య

  హైదరాబాద్ మరో దారుణం చోటుచేసుకుంది. సంక్రాంతి పండగ పూట సరదాగా మద్యం తాగుతూ ఇద్దరు వ్యక్తుల మధ్య చెలరేగిన గొడవ ఒకరి దారుణ హత్యకు దారితీసింది.  నడిరోడ్డుపైనే జరిగిన ఈ దారుణ హత్య పాతనగరంలోని చార్మినార్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. 

 • murder in road

  Telangana12, Jan 2019, 7:51 AM IST

  చాటుగా భార్య ఛాటింగ్...భర్త ఆత్మహత్య, చనిపోయినా రాని అర్థాంగి

  భర్తకు తెలియకుండా భార్య చేస్తోన్న ఛాటింగ్ ఓ కాపురాన్ని కూల్చేశాయి..ఓ చిన్నారిని అనాథను చేశాయి. వివరాల్లోకి వెళితే...కడప జిల్లా పులివెందుల మండలం గోటూరుకు చెందిన చరణ్ రెడ్డి ఐదేళ్ల కిందట ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చాడు. 

 • drugs

  Telangana11, Jan 2019, 7:53 PM IST

  ట్యాబ్లెట్ల రూపంలో డ్రగ్స్ సప్లయ్...ఇద్దరు నిందితుల అరెస్ట్

   నిషేదిత మత్తు పదార్థాలను ఎవరికీ అనుమానం రాకుండా ట్యాబ్లెట్ల రూపంలోకి మార్చి చాకచక్యంగా స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లాలోని బాలాపూర్‌లో ఇలా డ్రగ్స్ ని తరలిస్తూ పట్టబడిన నిందితుల నుండి 90 వేల విలువైన మత్తు పదార్థాలను స్వాదీనం చేసుకున్నట్లు రాచకొండ కమీషనర్ మహేష్ భగవత్ వెల్లడించారు.  

 • Telangana11, Jan 2019, 5:22 PM IST

  భార్యాభర్తల మద్య గొడవ...మనస్థాపంతో భర్త ఆత్మహత్య

  భార్య తనతో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయిందన్న మనస్థాపంతో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. భార్యను విడిచివుంటూ ఒంటరితనాన్ని భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.  
   

 • accident

  Telangana11, Jan 2019, 3:05 PM IST

  డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఓఆర్ఆర్ రోడ్డుప్రమాదం (వీడియో)

  హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల వద్ద ఓ కారు అదుపుతప్పి రోగులను తరలిస్తున్న అంబులెన్స్ ని ఢీకొట్టింది. తెల్లవారుజామున ముంచుకొస్తున్న నిద్రమత్తులోనే కారు డ్రైవర్ డ్రైవింగ్ కొనసాగించడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు.    

 • jail

  NATIONAL11, Jan 2019, 1:53 PM IST

  బాలికపై అత్యాచారం, మహిళకు 20 ఏళ్ల జైలు శిక్ష

  బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో పుణే కోర్టు సంచలనం తీర్పు వెలువరించింది. ఈ కేసులో మహిళ సహా ముగ్గురికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే... విదర్భ ప్రాంతానికి చెందిన ఓ 12 ఏళ్ల బాలిక 2016లో వేసవి సెలవుల్లో గడిపేందుకు ముండ్వాలోని తన మేనమామ ఇంటికి వచ్చింది. 

 • NATIONAL10, Jan 2019, 6:18 PM IST

  రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్న కర్నాటక మాజీ సీఎం...

  కర్నాటక మాజీ సీఎం సిద్దరామయ్య రోడ్డు ప్రమాదం నుండి తృటితో తప్పించుకున్నారు. ఆయన కాన్వాయ్ లోని వాహనాలు ఒకదాన్కోకటి ఢీకొట్టుకున్నప్పటికి సిద్దరామయ్య మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో సిద్దరామయ్య కాన్వాయ్ లోని ఐదు వాహనాలు తీవ్రంగా దెబ్బతినగా...అందులో ప్రయాణిస్తున్న ఓ ఎస్సై ఆందోళనకు గురై గుండెపోటుతో మరణించాడు. 

 • police suicide

  Andhra Pradesh10, Jan 2019, 4:19 PM IST

  జన్మభూమి సభకు వెళ్తూ అదుతప్పిన పోలీస్ వాహనం...కానిస్టేబుల్ మృతి

  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జన్మభూమి సభలో విషాదం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమ బందోబస్తుకు వెళుతూ ఓ పోలీస్ వాహనం ప్రమాదానికి గురయ్యింది. పోలీస్ వెహికిల్ అదుపుతప్పి రోడ్డు పక్కన వున్న చెట్టుకు ఢీకొట్టడంతో డ్రైవింగ్ చేస్తున్న కానిస్టేబుల్ మృతిచెందాడు. అంతేకాకుండా వాహనంలో ప్రయాణిస్తున్న ఎస్సైతో పాటు ముగ్గురు కానిస్టేబుళ్లు తీవ్ర గాయాలపాలయ్యారు. 
   

 • rape

  Telangana9, Jan 2019, 2:16 PM IST

  మైనర్ బాలికపై గ్యాంగ్‌రేప్...హైదరాబాద్ శివారులో దారుణం

  రంగారెడ్డి జిల్లా మంచాల మండల పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇటుక బట్టీలో పనిచేసే ఓ 14 ఏళ్ల మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే గ్రామ పెద్దలు ఈ బాలిక శీలానికి వెలకట్టి నిందితులను కాపాడే ప్రయత్నం చేశారు. వారి ప్రయత్నాలను అడ్డుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు.