Asianet News TeluguAsianet News Telugu

విశాఖలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు: ఆచూకీ లభ్యం

చేపల వేటకు  వెళ్లిన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ లభ్యమైంది. దీంతో కుటుంబ సభ్యులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Six Fishermen Found in Visakhapatnam District lns
Author
First Published Apr 3, 2024, 9:37 AM IST

విశాఖపట్టణం: సముద్రంలో చేపల వేటకు వెళ్లిన  ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ బుధవారం నాడు లభ్యమైంది. దీంతో  మత్స్యకారుల కుటుంబ సభ్యులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. నిన్న ఉదయం నుండి  మత్స్యకారుల కోసం  అధికారులు గాలింపు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.

విశాఖపట్టణం నుండి  సోమవారంనాడు ఆరుగురు మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లారు.సోమవారం నాడు రాత్రి  మత్స్యకారులు కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడారు. మంగళవారం నాడు మత్స్యకారులు  తీరానికి చేరుకోవాలి. కానీ వారి ఆచూకీ రాలేదు. దీంతో  మత్స్యకారుల కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే బుధవారం నాడు ఉదయం  అప్పికొండ ప్రాంతంలో  మత్స్యకారుల ఆచూకీ లభ్యమైంది.

సముద్రపు అలల ధాటికి  మత్స్యకారుల  బోటు బోల్తాపడింది. మంగళవారంనాడు రాత్రంతా  సముద్రంలోనే మత్స్యకారులు గడిపారు.అప్పికొండ తీరానికి చేరుకోని మత్స్యకారులకు సమాచారం ఇచ్చారు.

తప్పిపోయిన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ లభించింది.  విశాఖపట్టణం జిల్లాకు చెందిన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ లభ్యం కావడంతో  కుటుంబ సభ్యులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు తరచుగా ప్రమాదాలకు గురౌతున్న ఘటనలు  చోటు చేసుకుంటున్నాయి. చాలా సందర్భాల్లో మత్స్యకారులు ఈ ప్రమాదం నుండి  సురక్షితంగా బయటపడ్డారు,. మరికొన్ని సందర్భాల్లో  కొందరు మత్స్యకారులు చనిపోయిన ఘటనలు కూడ ఉన్నాయి.సముద్రంలో  గల్లంతైన మత్స్యకారుల కోసం  నేవీ అధికారులు  గాలింపులో  కీలక పాత్ర పోషిస్తున్నాయి. తాజాగా చోటు చేసుకున్న ఘటనలో  మత్స్యకారులు సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios