దురుసుగా ప్రవర్తించలేదు...రక్షించాం : వరంగల్ పోలీస్ కమిషనర్ (వీడియో)
హన్మకొండలో నిర్వహించిన ఆర్టీసీ ఉద్యోగుల ర్యాలీ సందర్భంగా జరిగిన తోపులాటలో కాజీపేట ఎ.సి.పి ర్యాలీలో పాల్గోన్న మహిళా ఉద్యోగినిల పట్ల దురుసుగా వ్యవహరించినట్లుగా అసత్యపు ప్రచారం జరుగుతోందన్నారు వరంగల్ పోలీస్ కమీషనర్.

వాస్తవానికి ర్యాలీ సందర్బంగా తోపులాట జరుగుతున్న సమయంలో మరో మహిళా ఉద్యోగిని తన సహద్యోగ అయిన బాధిత మహిళా కొంగును చేతులతో లాగింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న కాజీపేట ఏ.సి.పి స్పందించి కొంగును లాగుతున్న మహిళ చేతి నుండి బాధిత మహిళ కొంగును తప్పించారు. సదరు బాధిత మహిళ క్రిందపడిపోకుండా కాపాడారు. దీంతో పాటు కొంగులాగుతున్న మహిళను అడ్డుకుంటూనే సదరు బాధిత మహిళకు కాజీపేట ఎ.సి.పి రక్షణగా నిలవడం జరిగింది తప్ప మహిళల పట్ల ఎ.సి.పి ఎలాంటి దురుసుగా ప్రవర్తించ లేదు. అని వరంగల్ పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు.