medaram jatara video : మేడారం జాతర ఏర్పాట్లపై సమీక్ష

మేడారం జాతర ఏర్పాట్లపై సోమవారం హైదరాబాద్ లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో సమావేశం జరిగింది. గతంలో ఎప్పుడూ జరగని రీతిలో, అత్యంత ఘనంగా, దేనికి కొరత లేకుండా, భక్తులు ఏ ఒక్కరికి ఇబ్బంది రాకుండా ఈసారి మేడారం జాతరను వైభవంగా నిర్వహిస్తామని మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.

First Published Oct 29, 2019, 4:38 PM IST | Last Updated Oct 29, 2019, 4:38 PM IST

మేడారం జాతర ఏర్పాట్లపై సోమవారం హైదరాబాద్ లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో సమావేశం జరిగింది. గతంలో ఎప్పుడూ జరగని రీతిలో, అత్యంత ఘనంగా, దేనికి కొరత లేకుండా, భక్తులు ఏ ఒక్కరికి ఇబ్బంది రాకుండా ఈసారి మేడారం జాతరను వైభవంగా నిర్వహిస్తామని మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. 

గత రెండుసార్లు జాతరలో భక్తులకు కలిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆయా శాఖల అధికారులు ఈసారి ఆ లోపాలు జరగకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసిఆర్ మేడారం జాతర కోసం 75 కోట్ల రూపాయలను విడుదల చేశారని, వెంటనే ఈ జాతరకు సంబంధించిన 21 డిపార్ట్ మెంట్లు వారి పనులను ప్రారంభించాలని, సంక్రాంతిలోపు పనులన్నీ ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.

Video Top Stories