ఏపిలో కోవిడ్ ఆస్పత్రికి వెళ్లి భర్త అదృశ్యం.. రోడ్డెక్కిన భార్య (చూడండి)
విజయవాడ కోవిడ్ ఆసుపత్రి నుంచి వసంతరావు అనే వృద్దుడు వారం క్రితం అదృశ్యం అయ్యాడు.
విజయవాడ కోవిడ్ ఆసుపత్రి నుంచి వసంతరావు అనే వృద్దుడు వారం క్రితం అదృశ్యం అయ్యాడు. ఇప్పటికీ ఆచూకీ లభించక పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. పోలీసులు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే వసంతరావు అదృశ్యం అయ్యాడని భార్య ధనలక్ష్మి చెబుతున్నారు. వివరాల్లోకి వెడితే విజయవాడలో నివాసం ఉండే వసంతరావుకు బాగా ఆయాసం రావడంతో ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా కోవిద్ లక్షణాలు ఉన్నాయని ప్రభుత్వ ఆసుపత్రి కి పంపారు. ఈనెల 24వ తేదీన ఆస్పత్రి కి వెళ్లగా, చాలా సేపటికి స్పందించిన సిబ్బంది.. ఆయన్ని వీల్ చైర్ మీద లోపలకు పంపారు. పల్స్ పడిపోతున్నాయని. ఆక్సిజన్ పెట్టాలని చెప్పారు. భార్యను లోనికి రావద్దని చెప్పి ఇంటికి పంపించివేశారు. తెల్లారి వెడితే ఆ పేరు గలవారు ఎవరూ లేరని చెప్పారు. దీంతో పోలీస్ కంప్టైంట్ ఇచ్చిన భార్య ఆస్పత్రి ముందు ప్లకార్డు పట్టుకుని కూర్చున్నారు.