
World’s Most Expensive Wood: Agarwood Price Shocks the World
అగార్ వుడ్, ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? దీన్ని కొనాలంటే మన జీవితం సరిపోదు. పెద్ద పెద్ద కోటీశ్వర్లు, బిలియనర్లు మాత్రమే కొనగలరు. ఈ అగార్ వుడ్ కలప అనేది ఆక్విలారియా జాతికి చెందిన చెట్ల నుంచి దొరుకుతుంది. ఆ చెట్టు నుంచి పుట్టిన జిగురే... కలపను నల్లటి అగార్ వుడ్ గా మారుస్తుంది. ఈ కలపతో ఖరీదైన సెంట్లు, అగర్ బత్తీలు, మెడిసిన్స్ తయారీలో ఉపయోగిస్తారు. అందుకే దీన్ని లిక్విడ్ గోల్డ్ అంటారు. కిలో కోటిరూపాయలపైనే ఉంటుంది. ఇంకో విషయం తెలుసా ఈ చెట్టుకు రోగం వస్తేనే కోట్లలో కాసులు పడతాయి. గతంలో షాంఘైలో జరిగిన ఒక వేలంలో 2 కిలోల కైనమ్ కలప ఏకంగా రూ. 154 కోట్లకు కొన్నారు. ఏంటీ ఇంత రేటా? దానికి డిమాండ్ ఎందుకో ఈ వీడియోలో చూసేద్దాం.