
Operation Sindoor:పాకిస్తాన్‌కి ఇక చుక్కలే.. దాయాది దేశ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసం
భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కీలకమైన ప్రెస్ మీట్ నిర్వహించింది. ఇందులో తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాల గురించి వివరించారు. పహల్గాం ఘటన... దానికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్- పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ టార్గెట్‌గా పాక్ క్షిపణి దాడులు చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ద వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో భారత విదేశాంగ శాఖ కీలక సమాచారాన్ని వెల్లడించేందుకు మీడియా సమావేశం నిర్వహించింది. ఇందులో మరోసారి విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్రీతో పాటు సోఫియా ఖురేషి తాజా పరిణామాల గురించి వివరించారు.