బారాముల్లాపై పాక్ డ్రోన్ల దాడి.. గాలిలోనే తిప్పికొట్టిన భారత్ | Operation Sindoor | Asianet Telugu
బారాముల్లా (జమ్మూకశ్మీర్): పాకిస్తాన్ మరోసారి చీకటి మాటున దాడులకు తెగబడింది. బారాముల్లా జిల్లాపై డ్రోన్ దాడికి ప్రయత్నించగా, భారత భద్రతా దళాలు అప్రమత్తమై గగనతలంలోనే డ్రోన్లను తిప్పికొట్టాయి. సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్న వేళ, భారత వాయుసేన పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉంది. ఇప్పటికే పంజాబ్, జమ్మూ ప్రాంతాల్లో డ్రోన్ శకలాలు కనిపించాయి.