హంద్రీనీవా ప్రాజెక్టు వద్దకు చంద్రబాబు.. పనులు పరుగులు పెట్టించిన అధికారులు | Asianet News Telugu
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం చాయాపురంలో హంద్రీనీవా సుజల స్రవంతి పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ఇంజనీర్లు, అధికారులను పనుల ప్రగతి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అధికారులు సీఎం వెంట ఉన్నారు.