హిందూపురం అంటే నందమూరిపురం.. మీ అభిమానమే భూషణం: బాలయ్య మాస్ స్పీచ్ | Asianet News Telugu
నట సింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భారత అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా హిందూపురంలో పౌర సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తన నియోజకవర్గం హిందూపురం అంటే నందమూరిపురంగా భావిస్తానని చెప్పారు. ప్రజలు, అభిమానుల అభిమానమే తనకు పెద్ద భూషణమని తెలిపారు.