Asianet News TeluguAsianet News Telugu

ఆడోళ్లు కూడా లిక్కర్ స్కాములు... వాళ్లకసలు సిగ్గేలేదు : కేసీఆర్ కుటుంబంపై షర్మిల వ్యాఖ్యలు

హైదరాబాద్ : డిల్లీ లిక్కర్ స్కాం లో తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై వస్తున్న ఆరోపణలపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు.

First Published Dec 5, 2022, 2:57 PM IST | Last Updated Dec 5, 2022, 2:57 PM IST

హైదరాబాద్ : డిల్లీ లిక్కర్ స్కాం లో తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై వస్తున్న ఆరోపణలపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. ''ఆడమనిషి లిక్కర్ స్కాం ఏమిటమ్మా? ఎక్కడపెట్టుకోవాలి వాళ్ల తలకాయలు. వాళ్లకేమో అసలు సిగ్గేలేదు... ఆడోళ్లు కూడా లిక్కర్ స్కామ్ లు చేస్తారు'' అంటూ కవితతో పాటు కేసీఆర్ కుటుంబంపై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేసారు.  

లిక్కర్ స్కాములు చేసినవారిని వదిలిపెట్టి పాదయాత్ర చేస్తున్న మహిళపై వేధింపులా... మీకు సానుభూతి లేదా? అని షర్మిల ప్రశ్నించారు. మహిళను కార్లో కూర్చోబెట్టుకుని బలవంతంగా లాక్కుని వెళతారు... పార్టీ అధ్యక్షురాలిని పోలీస్ స్టేషన్లో ఏడుగంటల పాటు వుంచుతారు... ఎనబైవేల పుస్తకాలు చదివానంటారే ఇదేనా మీ ఇంగితం అంటూ సీఎం కేసీఆర్ పై షర్మిల మండిపడ్డారు.