వరి రైతుల సమస్యలు తెలుసుకుంటూ... మునుగోడులో వైఎస్ షర్మిల పాదయాత్ర
తెలంగాణ రాష్ట్రాన్ని కాలినడకన చుట్టివచ్చేందుకు ఇటీవలే వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. చేవెళ్లలో ప్రారంభమైన YS Sharmila ప్రజాప్రస్థానం పాదయాత్ర నవంబర్ 7న 19వ రోజుకు చేరుకుంది. ఆదివారం నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూర్ మండలంలో కొనసాగుతోంది. తెలంగాణాలో ఐకేపీ సెంటర్లు తెరుచుకోకపోవడంతో పండించిన వడ్లను రోడ్లపైనే ఆరబోసుకుని వరి రైతులు పడిగాపులు కాస్తున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటూ షర్మిల పాదయాత్ర ముందుకు సాగుతోంది. పాదయాత్రకు తమవంతు మద్దతు తెలుపుతూ తస్మానిగూడెం గ్రామ మహిళలు షర్మిలతో కలిసి నడిచారు