బహిర్భూమికి వెళ్లి... ఉధృతంగా ప్రవహిస్తున్న వాగుమధ్యలో చిక్కుకున్న యువకులు
జగిత్యాల జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
జగిత్యాల జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకల్లోకి ఒక్కసారిగా వరద నీరు చేరి చూస్తూ చూస్తుండగానే ప్రవాహ ఉధృతి పెరుగుతోంది. ఇలా ఓ వాగులో ప్రవాహం తక్కువగా వుండగా బహిర్భూమికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు నీటిప్రవాహం పెరగడంతో మధ్యలో చిక్కుకున్నారు. ఈ ఘటన కోరుట్లలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... కోరుట్ల అనుబంధ గ్రామమైన ఏకిన్ పూర్ శివారులోని వాగులో గురువారం ఉదయం ప్రవాహం తక్కువగా వుంది. దీంతో శ్రీనివాస్, విజయ్ అనే ఇద్దరు యువకులు బహిర్భూమి కోసం వాగుకు వచ్చారు. అయితే ఒక్కసారిగా వాగులో నీటి ఉధృతి పెరగడంతో ఇద్దరూ నీటిమధ్యలో చిక్కుకున్నారు. వీరిని గమనించిన స్థానికులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.