రూ.400 కోట్లతో వేములవాడ టెంపుల్ అభివృద్ది (వీడియో)
వేములవాడ: తెలంగాణలోనే అతి పెద్ద దేవాలయమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి క్షేత్రాన్ని కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తున్నా మని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ తో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాళేశ్వరం జలాలను మిడ్ మానేరు ద్వారా వేములవాడ గుడి చెరువులోకి వదిలారు. పంప్ హౌజ్ వద్ద మోటార్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. అనంతరం గుడి చెరువు వద్ద పూజలు చేసి గంగమ్మకు హారతినిచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రూ.400 కోట్లతో వేములవాడ ఆలయాన్ని అభివృద్ది చేస్తున్నామన్నారు. గుడి చెరువులోకి కాళేశ్వరం జలాలను తరలించడంతో పాటు మిని ట్యాంక్ బండ్ ను నిర్మించి సుందరీకరణ పనులు చేపట్టామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్, కలెక్టర్ కృష్ణ భాస్కర్, జెడ్పీ చైర్ పర్సన్ అరుణ, తదితరులు పాల్గొన్నారు.