Asianet News TeluguAsianet News Telugu

వేములవాడలో కారు బీభత్సం... టిఫిన్ సెంటర్లోకి దూసుకెళ్ళి మరీ మహిళలకు ఢీ

వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఇవాళ తెల్లవారుజామున ఓ కారు బీభత్సం సృష్టించింది.

వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఇవాళ తెల్లవారుజామున ఓ కారు బీభత్సం సృష్టించింది. పట్టణంలోని తిప్పాపూర్ వంతెనవద్ద మితిమీరిన వేగంతో వెళుతున్న కారు అదుపుతప్పి ఒక్కసారిగా రోడ్డుపక్కకు దూసుకెళ్లింది. ఇలా రోడ్డుపక్కన గల మొబైల్ టిఫిన్ సెంటర్లోకి దూసుకెళ్ళి ఇద్దరు మహిళలను ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన మహిళలను స్థానికులు దగ్గర్లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డ్రైవర్ తప్పతాగి మద్యంమత్తులో డ్రైవింగ్ చేయడంవల్లే ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన కారును పరిశీలించారు. ఈ యాక్సిడెంట్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.