Asianet News TeluguAsianet News Telugu

టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి పీఏతో నాకు ప్రాణహాని..: మహిళ సెల్పీ వీడియో

హైదరాబాద్ :  అధికార పార్టీ ఎమ్మెల్యే, హైదరాబాద్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మాగంటి గోపినాథ్ పీఏ విజయసింహతో తనకు ప్రాణహాని వుందంటూ ఓ మహిళ సెల్పీ వీడియో బయటపెట్టింది.

First Published Sep 20, 2022, 11:31 AM IST | Last Updated Sep 20, 2022, 11:31 AM IST

హైదరాబాద్ :  అధికార పార్టీ ఎమ్మెల్యే, హైదరాబాద్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మాగంటి గోపినాథ్ పీఏ విజయసింహతో తనకు ప్రాణహాని వుందంటూ ఓ మహిళ సెల్పీ వీడియో బయటపెట్టింది. గతకొంతకాలంగా విజయసింహ తన శారీరకంగానే కాదు మానసికంగానూ వేధించాడని... చివరకు నిన్న తన గొంతుకోసి చంపడానికి ప్రయత్నించాడని మహిళ ఆరోపించింది. అయితే తానే గొంతు కోసుకుని డ్రామాలాడుతున్నట్లు విజయసింహ ప్రచారం చేయిస్తున్నాడని... అధికార పార్టీ ఒత్తిడితో పోలీసులు కూడా కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని బాధితురాలు ఆరోపించారు. పోలీసులు అసలు తనను విచారించకుండానే విజయసింహ ఎలాంటి తప్పు చేయలేదని ఎలా నిర్దారిస్తారని ప్రశ్నించారు. తనపై తప్పుడు ప్రచారం ఆపకుంటే, న్యాయం చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానని మహిళ హెచ్చరించారు. ఇదిలావుంటే విజయసింహ దాడిచేసినట్లు ఆరోపిస్తూ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మహిళ స్టేట్మెంట్ రికార్డ్ చేశామని పంజాగుట్ట సిఐ హరిచంద్ర రెడ్ తెలిపారు. 448, 324, 354(a) 506 ఐపిఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నమని ఆయన తెలిపారు. మహిళ ఆరోపణలు చేస్తున్న విజయ్ కు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని... అరెస్ట్ చేయలేదని పంజాగుట్ట సీఐ తెలిపారు.