Asianet News TeluguAsianet News Telugu

అమ్మో పులి... అటవీశాఖ దండోరా (వీడియో)

ఆసిఫాబాద్ జిల్లాతో పాటు సరిహద్దు ప్రాంతంలో సంచరిస్తున్న పులులు, మనుషులపై దాడి నివారణకు అటవీశాఖ అన్ని చర్యలు తీసుకుంటోంది. 

ఆసిఫాబాద్ జిల్లాతో పాటు సరిహద్దు ప్రాంతంలో సంచరిస్తున్న పులులు, మనుషులపై దాడి నివారణకు అటవీశాఖ అన్ని చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా తెలంగాణ అటవీ శాఖ తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించి తగిన సలహాలు, సూచనలు చేసేందుకు జాతీయ పులుల సంరక్షణ కేంద్రం (ఎన్‌టీసీఏ), వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ) (డెహ్రడూన్) ప్రతినిధులను పంపాల్సిందిగా అటవీ శాఖ కోరింది. ఇదే సమయంలో పులి బారి నుంచి తప్పించుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు దండోరా వేయించారు.