పెద్దపల్లిలో వీధికుక్కల స్వైరవిహారం... మూడేళ్ల చిన్నారి చెంపను చీల్చి, మరో నలుగురిపై దాడి

పెద్దపల్లి : హైదరాబాద్ అంబర్ పేటలో వీధికుక్కల దాడిలో చిన్నారి దుర్మరణం మరిచిపోకముందే అనేక ఘటనలు వెలుగుచూస్తున్నారు.తెలుగు రాష్ట్రాల్లో మరీముఖ్యంగా తెలంగాణలో రోజురోజుకు చిన్నారులపై వీధికుక్కల దాడి ఘటనలు పెరిగిపోతున్నాయి.

First Published Mar 14, 2023, 12:30 PM IST | Last Updated Mar 14, 2023, 12:30 PM IST

పెద్దపల్లి : హైదరాబాద్ అంబర్ పేటలో వీధికుక్కల దాడిలో చిన్నారి దుర్మరణం మరిచిపోకముందే అనేక ఘటనలు వెలుగుచూస్తున్నారు.తెలుగు రాష్ట్రాల్లో మరీముఖ్యంగా తెలంగాణలో రోజురోజుకు చిన్నారులపై వీధికుక్కల దాడి ఘటనలు పెరిగిపోతున్నాయి.తాజాగా పెద్దపల్లి జిల్లా ఓదెల మండలకేంద్రంలో ఓ ఇంటిబయట ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారిని గాయపర్చింది ఓ వీధి కుక్కు.అంతేకాదు మరో ముగ్గురిని కూడా ఈ కుక్క గాయపర్చినట్లు గ్రామస్తులు చెబుతున్నాయి.  ఓదెల గ్రామానికి చెందిన మూడేళ్ళ చిన్నారి కనికిరెడ్డి దిహాసిని ఇంటిముుందు ఆడుకుంటుండగా ఓ వీధికుక్క ఒక్కసారిగా దాడిచేసింది. చిన్నారి చెంపను పట్టుకుని లాగడంతో చిన్నారి తీవ్రంగా గాయపడింది. దీంతో కుటుంబసభ్యులు వెంటనే బాలికను పెద్దపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చిన్నారితో పాటు మరో నలుగురిపైనా కుక్క దాడి చేసింది. కుక్కల బెడదనుండి తమను కాపాడాలని గ్రామస్తులు అధికారులు, నాయకులను కోరుతున్నారు.