ఖైరతాబాద్ వినాయకుడి ప్రతిష్ట ఇదీ.. (వీడియో)
దేశంలోనే ఈ ఏడాది అత్యంత ఎత్తయిన వినాయక విగ్రహంగా హైదరాబాదులోని ఖైరతాబాద్ విగ్రహం ప్రసిద్ధికెక్కింది. ఖైరతాబాద్ మహా గణపతి శ్రీ ద్వాదశాదిత్య మహా గణపతి పేరుతో పూజలు అందుకుంటోంది.
దేశంలోనే ఈ ఏడాది అత్యంత ఎత్తయిన వినాయక విగ్రహంగా హైదరాబాదులోని ఖైరతాబాద్ విగ్రహం ప్రసిద్ధికెక్కింది. ఖైరతాబాద్ మహా గణపతి శ్రీ ద్వాదశాదిత్య మహా గణపతి పేరుతో పూజలు అందుకుంటోంది. ఈ మహాగణపతి ఎత్తు 61 అడుగులు కాగా, 12 తలలు, 24 చేతులు, 12 సర్పాలతో అలరారుతోంది. కుడివైపున బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పాటు శక్తిమాత దుర్గను ప్రతిష్టించారు.
విగ్రహ నిర్మాణం, అలంకరణ, సిసీ కెమెరాల ఏర్పాటు, పోలీసు భద్రత, ప్రైవేట్ భద్రత తదితర ఏర్పాట్లతో భక్తుల పూజలు అందుకోవడానికి ఖైరతాబాద్ మహా గణపతి సిద్ధంగా ఉన్నాడు. గణపతికి పూలమాల, ఇతర పుష్పాల అలంకరణల కోసం దాదాపు రూ.2 లక్షలు ఖర్చు చేశారు. 300 కిలోల బంతి పూలు, 100 కిలోల చామంతులు, 200 కిలోల తమలపాకులు, వంద అశోక చెట్లు, 30 అరటి చెట్లతో అలంకరణ చేశారు.