నువ్వు లేని జీవితం నాకొద్దు: దుబాయ్ లో తెలంగాణ యువకుడు ఆత్మహత్య (సెల్పీ వీడియో)
జగిత్యాల: వారిద్దరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు.
జగిత్యాల: వారిద్దరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. జీవితంలో స్థిరపడి పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకున్న యువకుడు విదేశాలకు వెళ్లగా యువతికి పెళ్లిచేసేందుకు కుటుంబసభ్యులు ప్రయత్నించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయిన యువతి ఆత్మహత్య చేసుకోగా ఈ విషయం తెలిసి తట్టుకోలేక ప్రియుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా జగిత్యాలలో ప్రియురాలు మనీషా-దుబాయ్ లో ప్రియుడు రాకేష్ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్న విషాద సంఘటన ఇటీవల చోటుచేసుకుంది.