తెలంగాణలో గ్రూప్-1,2 ఉద్యోగాల నోటిఫికేషన్: నిరుద్యోగులకు జోనల్ చిక్కులు

దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస కు తగిలిన ఎదురుదెబ్బలు నేపథ్యంలో నిరుద్యోగుల సమస్యపై దృష్టి సారించింది 

First Published Dec 22, 2020, 1:20 PM IST | Last Updated Dec 22, 2020, 1:20 PM IST

దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస కు తగిలిన ఎదురుదెబ్బలు నేపథ్యంలో నిరుద్యోగుల సమస్యపై దృష్టి సారించింది తెరాస సర్కార్. 50 వేల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంతో నిరుద్యోగ యువతలో ఆనందం వెల్లివిరుస్తోంది. కానీ... రాష్ట్రంలో కొలువుల భర్తీకి కొత్త జోనల్‌ విధానం సమస్యగా మారింది. 31 జిల్లాల స్థానికతతో కూడిన జోనల్‌ విధానం అమల్లోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా.. ఇప్పటివరకూ పోస్టులను పునర్విభజించలేదు. దీంతో నోటిఫికేషన్ల విడుదల ఆలస్యమవుతోంది. అయితే కొత్త జోనల్‌ విధానం ప్రకారం.. మల్టీజోన్లు, జోన్లు, జిల్లాల వారీగా పోస్టులేవో టీఎ్‌సపీఎస్సీకి ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు.