ఆగిపోయిన దరఖాస్తుల స్వీకరణ.. అయోమయంలో వలస కార్మికులు..
తెలంగాణ ప్రభుత్వం వలసకార్మికులను సొంత రాష్ట్రాలకు పంపించడానికి ట్రైన్లు ఏర్పాటు చేస్తున్నా వేలాదిమంది వలసకార్మికులు మిగిలే పోతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం వలసకార్మికులను సొంత రాష్ట్రాలకు పంపించడానికి ట్రైన్లు ఏర్పాటు చేస్తున్నా వేలాదిమంది వలసకార్మికులు మిగిలే పోతున్నారు. అనుమతి పత్రాలకు అప్లై చేసుకున్నా ఓటీపీ రానివారు చాలామంది ఉన్నారు. ట్రైన్ టైం సమయానికి ఓటీపీ వస్తే లింగంపల్లో, ఘట్ కేసరో వెళ్లడానికి సమయం సరిపోవడం లేదని వాపోతున్నారు. ఇదిలా ఉండగా గురువారం అనుమతి పత్రాల అప్లై ఆపేయడంతో వలసకార్మికుల్లో ఆందోళన బయలుదేరింది.