Asianet News TeluguAsianet News Telugu

మళ్ళీ అధికారం బీఆర్ఎస్ దేనా..? ఈసారీ కేసీఆరే సీఎం అని చెప్పిన ఎగ్జిట్ పోల్స్ ఇవే...

మెజారిటీ ఎగ్జిట్ పోల్స్  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకే అధిక స్థానాలు  దక్కే అవకాశం ఉందని  తేల్చి చెప్పాయి. 

మెజారిటీ ఎగ్జిట్ పోల్స్  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకే అధిక స్థానాలు  దక్కే అవకాశం ఉందని  తేల్చి చెప్పాయి. కాంగ్రెస్ పార్టీ  60కిపైగా స్థానాలను దక్కించుకొంటుందని పలు సంస్థలు ప్రకటించాయి. అయితే ఎగ్జిట్ సర్వే ఫలితాలను  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కొట్టిపారేశారు.  గతంలో కూడ  బీఆర్ఎస్ ఓటమి పాలౌతుందని సర్వే సంస్థలు ప్రకటించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. 70కి పైగా సీట్లతో అధికారాన్ని దక్కించుకుంటామని కేటీఆర్ ధీమాను వ్యక్తం చేశారు.  ఇదిలా ఉంటే  ఇవాళ పలు సర్వే సంస్థలు  ప్రకటించిన  ఎగ్జిట్ పోల్స్ నిజమైతే కేటీఆర్ ఆ సర్వే సంస్థలకు క్షమాపణలు చెబుతారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.