Asianet News TeluguAsianet News Telugu

జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ తో తెలంగాణ బిసి కమీషన్ సభ్యుల భేటీ...

న్యూడిల్లీ :  తెలంగాణకు చెందిన 40 బీసీ కులాలు ఓబిసి జాబితాలో చేర్చాలని జాతీయ బీసీ కమిషన్ కు తెలంగాణ బీసీ కమిషన్ సభ్యులు విజ్ఞప్తి చేశారు. 

First Published Dec 15, 2022, 4:33 PM IST | Last Updated Dec 15, 2022, 4:33 PM IST

న్యూడిల్లీ :  తెలంగాణకు చెందిన 40 బీసీ కులాలు ఓబిసి జాబితాలో చేర్చాలని జాతీయ బీసీ కమిషన్ కు తెలంగాణ బీసీ కమిషన్ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో వున్న తెలంగాణ బిసి కమీషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, కిషోర్ గౌడ్, తెలంగాణ షీప్‌ అండ్‌ గోట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దూదిమెట్ల బాలరాజు జాతీయ బిసి కమీషన్ ఛైర్మన్ హన్స్ రాజ్ గంగారాం అహీర్ తో భేటి అయ్యారు. తెలంగాణలో బిసిలుగా కొనసాగుతున్న 40కి పైగా కులాలు కేంద్రంలో ఓబిసి జాబితాలో చేర్చబడలేవని... దీంతో విద్యా, ఉద్యోగ, ఉపాధి పరంగా అన్యాయానికి గురవుతున్నారని అన్నారు. తక్షణమే జాతీయ బీసీ కమిషన్ స్పందించి బిసి కులాలకు న్యాయం జరిగేలా చూడాలని తెలంగాణ నాయకులు కోరారు.