పిల్లల్ని పండక్కి ఇంటికిపంపడం లేదంటూ... స్కూల్ ముందు తల్లిదండ్రుల ఆందోళన

జగిత్యాల : రాఖీ పండగపూట తమ బిడ్డలను ఇంటికి పంపించడంలేదంటూ తల్లిదండ్రులు ఆందోళనకు దిగిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. 

| Updated : Aug 31 2023, 09:37 PM
Share this Video

జగిత్యాల : రాఖీ పండగపూట తమ బిడ్డలను ఇంటికి పంపించడంలేదంటూ తల్లిదండ్రులు ఆందోళనకు దిగిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. మెట్ పల్లి పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల ముందు జాతీయ రహదారిపై విద్యార్థుల తల్లిదండ్రులు బైఠాయించారు. వెంటనే తమ పిల్లలను పండక్కి ఇంటికి పంపించాలంటూ డిమాండ్ చేసారు. అయితే  పాఠశాల ప్రిన్సిపాల్ అందుబాటులో లేకపోవడంతో సిబ్బంది ఏ నిర్ణయమూ తీసుకోకపోవడంతో తల్లిదండ్రుల ఆందోళన కొనసాగింది.  దీంతో రహదారిపై వాహనాలు కిలో మీటర్ మేర నిలిచిపోయి భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. 
 

Related Video