అంబర్ పేట ఘటన మరువకముందే ... హాస్టల్లోకి చొరబడి విద్యార్థిపై దాడిచేసిన వీధికుక్కలు
కరీంనగర్ : హైదరాబాద్ లోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా వీధికుక్కల స్వైరవిహారం చేస్తున్నారు.
కరీంనగర్ : హైదరాబాద్ లోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా వీధికుక్కల స్వైరవిహారం చేస్తున్నారు. అంబర్ పేటలో అభం శుభం తెలియని ఐదేళ్ల బాలుడు వీధికుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమానుష ఘటన మరువకముందే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అలాంటి దారుణాలే చోటుచేసుకున్నాయి. శంకరపట్నం ఎస్సీ హాస్టల్లో చదువుకుంటున్న సుమన్ అనే విద్యార్థి కూడా కుక్కల బారిన పడ్డాడు. హాస్టల్లోకి చొరబడి మరీ వీధికుక్కలు బాలుడిపై దాడిచేసాయి. దీంతో హాస్టల్ సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారమివ్వగా వారు హాస్పిటల్ కు తరలించారు. ఇదే కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మల్లారెడ్డి గ్రామానికి చెందిన రాపాక యేసయ్య(55) కుక్కలు వెంటపడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. బైక్ పై వెళుతున్న యేసయ్యను వీధికుక్కలు వెంటపడటంతో భయపడిపోయిన అతడు వేగంగా పోనిచ్చాడు. ఈ క్రమంలోనే బైక్ అదుపుతప్పి కిందపడటంతో యేసయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని కుటుంబసభ్యులు హుజురాబాద్ హాస్పిటల్ కు తరలించారు.