లాక్ డౌన్ ఛాలెంజ్.. కేటీఆర్‌కు ప్రేమ‌తో.. 108 పొట్రెయిట్స్ గీసిన ఎన్నారై..

లాక్ డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ 108 కేటీఆర్ పొట్రెయిట్స్ గీసి సరికొత్త రికార్డ్ సృష్టించాడో ఎన్నారై. 

First Published Jul 20, 2020, 4:19 PM IST | Last Updated Jul 20, 2020, 4:19 PM IST

లాక్ డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ 108 కేటీఆర్ పొట్రెయిట్స్ గీసి సరికొత్త రికార్డ్ సృష్టించాడో ఎన్నారై. హైదరాబాద్ లోని అశోక్ నగర్ కు చెందిన  అరవింద్ అమెరికాలో ఒపస్ మీడియా గ్రూప్ ను రన్ చేస్తున్నాడు. శాన్ ఫ్రాన్సిస్కోలో స్థిరపడ్డారు. కోవిద్ 19 లాక్ డౌన్ సమయాన్ని కేటీఆర్ పొట్రెయిట్స్ వేయడానికి వాడుకున్నాడు. ఇప్పటివరకు ఒకే నాయకుడిమీద 108 పొట్రెయిట్ వేసిన దాఖలాలు లేవు. గ‌తంలో బాల్‌థాక్రేపై 101 పొట్రెయిట్స్ వేసిన రికార్డు ఉంది. తాజాగా అరవింద్ కేటీఆర్‌పై 108 పోట్రెయిట్స్ గీయ‌డంతో ఆ రికార్డును బ్రేక్ చేసిన‌ట్టు అవుతుంద‌ని చెప్తున్నారు. తాను వేసిన పెన్సిల్ స్కెచెస్‌తో బుక్‌.. క్యాలెండ‌ర్ ముద్రించ‌డంతో పాటు ఇండియా వ‌చ్చిన త‌ర్వాత ఎగ్జిబిష‌న్ పెట్ట‌నున్న‌ట్లు అత‌ను చెప్తున్నారు.