కరోనా కర్కశత్వం.. 80 యేళ్ల ముసలి తల్లిని రోడ్డు మీద వదిలేసిన కొడుకులు..
కరోనా భయంతో 80యేళ్ల వృద్ధురాలైన కన్నతల్లిని ఇంట్లోనుండి వెళ్లగొట్టిన అమానుష ఘటన కరీంనగర్ లో చోటుచేసుకుంది.
కరోనా భయంతో 80యేళ్ల వృద్ధురాలైన కన్నతల్లిని ఇంట్లోనుండి వెళ్లగొట్టిన అమానుష ఘటన కరీంనగర్ లో చోటుచేసుకుంది. నడిరోడ్డుమీద ఆ ముసలి తల్లి వేదన చూసిన స్థానికులు నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తే ఆమె ఇంట్లోకి వస్తే డ్యామ్ ల దూకి చస్తం అని ఆ కొడుకులు బెదిరిస్తున్నారు. వివరాల్లోకి వెడితే కిసాన్ నగర్ లో ఉండే శ్యామల అనే వృద్ధురాలు లాక్ డౌన్ కు ముందు మహారాష్ట్ర షోలాపూర్ లోని బంధువుల ఇంటికి వెళ్లింది. వెంటనే లాక్ డౌన్ కారణంగా ఇన్ని రోజులు అక్కడే ఉండిపోయింది. ఇప్పుడు సడలింపుల నేపథ్యంలో ఊరికి చేరుకుంది. కానీ ముగ్గురు కొడుకులూ ఇంట్లోకి రానివ్వడానికి ఇష్టపడలేదు.. కరోనా ఉందేమోనంటూ రోడ్డు మీదికి నెట్టేశారు. షోలాపూర్ లో టెస్టులు చేశారని నెగెటివ్ వచ్చిందని ముసలామె ఎంత చెప్పినా కొడుకులు వినిపించుకోవడం లేదు. మానవసంబంధాల్ని కరోనా ఎలా దెబ్బతీస్తుందో చెప్పే సంఘటన ఇది.