Asianet News TeluguAsianet News Telugu

సైలెన్సర్లపైకి రోడ్డురోలర్ ఎక్కించి ... ధ్వంసంచేసిన కరీంనగర్ పోలీసులు

కరీంనగర్ : చెవులకు చిల్లులు పడేలా శబ్దాలు చేస్తూ కొందరు ఆకతాయిలు రయ్ రయ్ మంటూ రోడ్లపై దూసుకెళుతుంటారు.

కరీంనగర్ : చెవులకు చిల్లులు పడేలా శబ్దాలు చేస్తూ కొందరు ఆకతాయిలు రయ్ రయ్ మంటూ రోడ్లపై దూసుకెళుతుంటారు.ఇలా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడమే కాదు ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్న వాహనదారులపై  కరీంనగర్ పోలీసులు కొరడా ఝళిపించారు. అధిక శబ్దాలు చేసే సైలెన్సర్లను వాహనాలకు బిగించి రోడ్లపైకి వచ్చేవారి ఆటకట్టించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు పోలీసులు. ఇలా పట్టుబడిన వారిని పట్టుకుని కేవలం ఫైన్లతో సరిపెట్టకుండా ఆ సైలెన్సర్లను స్వాధీనం చేసుకున్నారు. ఇలా స్వాధీనం చేసుకున్న సైలెన్సర్లను తాజాగా రోడ్డు రోలర్లతో ధ్వంసం చేయించారు.కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో ఈ సైలెన్సర్ల ధ్వంసం కార్యక్రమాన్ని చేపట్టారు.