రెచ్చిపోయిన ఇసుక మాఫియా గ్యాంగ్... పోలీసులపై రాళ్లు, కర్రలు, పారలతో దాడి
కరీంనగర్: ఇసుక మాఫియా ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి.
కరీంనగర్: ఇసుక మాఫియా ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. ఇసుకను అక్రమంగా తరలించడాన్ని అడ్డుకోడానికి ప్రయత్నించిన సామాన్య ప్రజానికాన్నే కాదు పోలీసులపైనా దాడులకు తెగబడుతున్నారు. ఇలా తాజాగా జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వేంపల్లి వెంకట్రావు పేటలో పోలీసులపై ఇసుక మాఫియా దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది.
అర్ధరాత్రి గోదావరి నదిలోంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో మల్లాపూర్ ప్రొబేషనరీ ఎస్ఐ వెంకటేష్, కానిస్టేబుళ్లు శ్రీనివాస్, రాజ్ కుమార్, సురేష్‌లు తనిఖీ కోసం వెళ్లారు. ఈ క్రమంలోనే వీరిపై ఇసుక మాఫియా ముఠా దాడికి పాల్పడ్డారు. రాళ్లు, పారలు, కర్రలతో దాడికి పాల్పడటంతో ముగ్గురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.