
చైనీస్ మాంజాపై సజ్జనార్ కొరడా
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నిషేధిత చైనీస్ మాంజా విక్రయాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ విస్తృత చర్యలు చేపట్టింది. నగర కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో భారీగా చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నారు.నగరవ్యాప్తంగా అన్ని జోన్లలో నిర్వహించిన దాడుల్లో ఇప్పటివరకు మొత్తం 103 కేసులు నమోదు కాగా, 143 మంది నిందితులను అరెస్టు చేశారు.