
విద్యార్థి దశలోనే రోడ్ సేఫ్టీ అవగాహన కల్పించాలి: Revanth Reddy on Road Safety
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ ఏ. రేవంత్ రెడ్డి గారు మరియు డీజీపీ శ్రీ బి. శివధర్ రెడ్డి గారు “Arrive Alive” రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచడం, సురక్షితంగా ప్రయాణించాలనే భావనను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.ఈ సందర్భంగా వారు హెల్మెట్ వినియోగం, సీట్ బెల్ట్, మద్యం సేవించి వాహనం నడపకుండా ఉండటం వంటి అంశాలపై ప్రజలను చైతన్యపరిచారు.