Asianet News TeluguAsianet News Telugu

నల్గొండలో ట్రావెల్స్ బస్ బోల్తా... 15 మందికి గాయాలు, ఆరుగురి పరిస్థితి విషమం

నల్గొండ : విజయవాడ నుండి హైదరాబాద్ వెళుతున్న ట్రావెల్స్ బస్సు మార్గమధ్యలో ప్రమాదానికి గురయ్యింది.

First Published Dec 13, 2022, 1:30 PM IST | Last Updated Dec 13, 2022, 1:30 PM IST

నల్గొండ : విజయవాడ నుండి హైదరాబాద్ వెళుతున్న ట్రావెల్స్ బస్సు మార్గమధ్యలో ప్రమాదానికి గురయ్యింది. ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు జాతీయ రహదారిపై వేగంగా వెళుతూ నల్గొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో బస్సులోని 15మంది ప్రయాణికులు గాయపడగా వీరిలో డ్రైవర్ తో సహా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నార్కట్ పల్లి కామినేని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.  ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు వుండగా చాలామంది సురక్షితంగా బయటపడ్డారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. బస్ యాక్సిడెంట్ పై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. రోడ్డుపై అడ్డంగా పడి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న బస్సును క్రేన్ సాయంతో తొలగించారు. ప్రమాదంప కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. 

Video Top Stories