ఆపరేషన్ టన్నెల్: SLBC సొరంగం వద్ద ఇదీ పరిస్థితి | Asianet News Telugu
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) సొరంగ మార్గంలో ప్రమాదం యావత్ దేశాన్ని ఆందోళనకు గురి చేసింది. సొరంగం కూలిన ప్రాంతంలో 8 మంది కూలీలు చిక్కుకుపోయారు. వారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగి సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం SLBC ప్రమాదంపై దృష్టి పెట్టాయి. అయితే, టన్నెల్ లోపలికి వెళ్లేందుకు అనుకూలమైన పరిస్థితులు లేకపోవడంతో చిక్కుకుపోయిన వారి వద్దకు చేరుకోవడం కష్టతరంగా మారుతోందని సిబ్బంది చెబుతున్నారు.