వనపర్తి జిల్లాలో విషాదం... బైక్ తో సహా వాగులో కొట్టుకుపోయిన తల్లీ, కూతురు, కొడుకు

వనపర్తి : కొద్దిరోజులుగా తెలంగాణవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో మరోసారి నదులు, వాగులు వంకలు, చెరువుల్లో నీటి ఉదృతి పెరిగింది.

Share this Video

వనపర్తి : కొద్దిరోజులుగా తెలంగాణవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో మరోసారి నదులు, వాగులు వంకలు, చెరువుల్లో నీటి ఉదృతి పెరిగింది. ఇలా ప్రమాదకరంగా వరదనీరు ప్రవహిస్తున్న వంతెనపైనుండి బైక్ పై దాడే ప్రయత్నంలో తల్లికూతురు సహా మరో యువకుడు కొట్టుకుపోయాడు. ఈ దుర్ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. దసరా పండక్కి వనపర్తి జిల్లా కొత్తకోటలోని అక్క కొడుకు సాయికుమార్ ఇంటికి కూతురు పరిమళ(17)తో కలిసి వెళ్ళారు సంతోషమ్మ(35). అక్కడే ఆనందంగా పండగ జరుపుకుని గత శుక్రవారం తమ ఇంటికి పయనమయ్యారు. ఈ క్రమంలోనే సాయికుమార్ బైక్ పై పిన్ని, చెల్లిని ఎక్కించుకుని వెళుతుండగా ప్రమాదం జరిగింది. మదనాపురం శివారులో సరళాసాగర్ దిగువన గల వంతెన పైనుండి వరదనీరు ఉదృతంగా ప్రవహిస్తున్న అలాగే బైక్ ను పోనిచ్చాడు సాయికుమార్. దీంతో నీటి ప్రవాహదాటికి బైక్ తో సహా ముగ్గురూ కొట్టుకుపోయారు. ఇది చూసిన కొందరు యువకులు వారిని కాపాడే ప్రయత్నం చేసినా సాధ్యంకాలేదు. 

Related Video