బీసీ బిల్లు ఒకటి కాదు.. మూడు వేర్వేరుగా పెట్టాలి: MLC Kalvakuntla Kavitha | Asianet News Telugu
తెలంగాణ బీసీ బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపి చేతులు దులుపుకుంటే కుదరదన్నారు. జనగామలో ఆమె మీడియాతో మాట్లాడుతూ... బీసీ బిల్లు ఒకటి కాదని.. మూడు వేర్వేరు బిల్లులు పెట్టాలని డిమాండ్ చేశారు. విద్య, ఉద్యోగాలకు, స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లకు వేర్వేరుగా రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లులు పెట్టాలన్నారు. కుల గణన మళ్లీ చేపడతామన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన కవిత.. సర్వేకి నెల రోజుల పాటు సమయం ఇవ్వాలని కోరారు. రీ సర్వేపై ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేయాలని.. టోల్ ఫ్రీ నెంబరును విస్త్రృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.